ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మిగిలిన 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గెలవడం జరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న సందర్భంలోనే చంద్రబాబు… తన మకాం మొత్తం విజయవాడ కు మార్చడం జరిగింది. కారణం చంద్రబాబు 'ఓటుకు నోటు కేసులో' దొరికిపోవడం అని చాలామంది ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు కామెంట్ చేస్తుంటారు.

 

ఇప్పుడు ఇదే తరుణంలో అప్పటినుండి ఇప్పటివరకు అనగా అసెంబ్లీ సాక్షిగా జరిగిన సమావేశాల వరకూ చంద్రబాబుని టెక్నాలజీ పట్టుకుని పీడిస్తుంది అంటే ప్రతి సందర్భంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుందని… ముఖ్యంగా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పరువు టెక్నాలజీ తీస్తుందని ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు చేస్తున్న కామెంట్. విషయంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో బాబు అసెంబ్లీలో ఏదైనా వాదన తీసుకు వస్తున్న సందర్భంలో టెక్నాలజీని జగన్ చాలా గట్టిగా వాడుతున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.

 

చంద్రబాబు ప్రభుత్వం పై ఎన్ని విమర్శలు చేసినా ఏ విధంగా అయినా బురద చల్లాలని చూసిన ఏకంగా అసెంబ్లీలోనే ఎల్ఈడి స్క్రీన్ పెట్టి చంద్రబాబు గతంలో మాట్లాడిన సదరు విషయానికి సంబంధించిన విషయాలను వీడియో రూపంలో ఉన్న విషయాలను ప్లే చేసి మరి చంద్రబాబు పరువు టెక్నాలజీ వ్యూహంతో జగన్ తీసేస్తున్నారు అని...తాజాగా అసెంబ్లీ గేటు వద్ద అయితే దారుణంగా ప్రభుత్వ ఉద్యోగుల పై చాలా దారుణమైన పదజాలం వాడి అడ్డంగా చంద్రబాబు బుక్ అవడమే కాకుండా ఏకంగా ఆయన తనయుడు నారా లోకేష్ అయితే మార్షల్స్ మెడ పట్టుకున్న ఘటన వీడియో రూపంలో అడ్డంగా బుక్ అవడంతో… ఈ దృశ్యాలు మొత్తం వీడియో రూపంలో అసెంబ్లీలో జగన్ ప్లే చేయడంతో టెక్నాలజీ పరంగా చంద్రబాబు ప్రస్తుత రాజకీయాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: