కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ నేడు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సోనియా గాంధీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన 'భారత్‌ బచావో' ర్యాలీలో పాల్గొన్న సోనియా గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని, దేశంలోని పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అధిక ధరలతో ప్రజలు అల్లాడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

                                

దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, దేశాన్ని రక్షించుకునేందుకు మనం అందరం కలిసి పోరాటం చేయాలి అని సోనియా గాంధీ పిలుపునిచ్చారు. దేశంలోని యువతకు ఉద్యోగాలు రావట్లేదు, రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు అందట్లేదు, పౌరసత్వ బిల్లు వల్ల భారతీయ ఆత్మ ముక్కలు ముక్కలు అవుంతుందని తెలిసిన ఆ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా ఏ మాత్రం పట్టించుకోవట్లేదు అంటూ సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

                                       

ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ మాట్లాడుతూ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తేసి ఎటువంటి చర్చ లేకుండానే తమకు కావాల్సిన బిల్లులు ఆమోదించుకున్నారని ఆమె పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన భారత్‌ బచావో ర్యాలీలో ఎంపీ రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా, సీనియర్‌ నేత చిదంబరం, తదితరులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. కాగా ప్రస్తుతం సోనియా గాంధీ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: