అలాగనే రాజకీయ సర్కిళ్ళల్లో బాగా ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి దెబ్బకే ఈనాడు గ్రూపు సంస్ధల అధినేత రామోజీరావు ఈనాడు దినపత్రిక చీఫ్ ఎడిటర్ బాధ్యతల నుండి తప్పుకున్నట్లు సమాచారం. బాధ్యతల నుండి తప్పుకోవాలని ఎప్పుడు తీసుకున్న నిర్ణయమో తెలీదు కానీ  జగన్ తీసుకొచ్చిన ఓ జీవోనే రామోజి నిర్ణయానికి ప్రధాన కారణంగా ప్రచారంలో ఉంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ప్రభుత్వంపై తప్పుడు వార్తలు, బురదచల్లే మీడియాపై కఠినమైన చర్యలు తీసుకోవటానికే జగన్ ప్రభుత్వం 2430 జీవోను తెచ్చారు. ఇప్పటి వరకూ ఏదో రూపంలో ఇటువంటి నిబంధనలున్నా  ప్రభుత్వాలు ఎప్పుడూ తీవ్రంగా పరిగణించలేదు. ఇపుడు జగన్ మాత్రం ఎల్లోమీడియా విషయంలో చాలా కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

 

అసలే జగన్ ను మొదటినుండి చంద్రబాబునాయుడు కోసమే ఎల్లోమీడియా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రతి విషయంపైనా ఎల్లోమీడియా కావాలనే బురదచల్లుతోంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే జీవో 2430 పై జగన్ తన అభిప్రాయాన్ని కుంబబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఈ జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకునేలా చేయాలని  చంద్రబాబు ద్వారా ఎంత ప్రయత్నం చేసినా ఎల్లోమీడియాకు సాధ్యం కాలేదు.

 

దాంతో భవిష్యత్తును ఊహించుకున్న రామోజీ వేరే దారిలేకే తన చీఫ్ ఎడిటర్ స్ధానాన్ని వెంటనే ఖాళీ చేసేసినట్లు జనాలు  చెప్పుకుంటున్నారు. చీఫ్ ఎడిటర్ గా ఎవరినీ నియమించలేదు కానీ ఎడిటర్లుగా ఏపి, తెలంగాణా ఎడిషన్లకు వేర్వేరుగా ఇద్దరిని నియమించటం సంచలనంగా మారింది.

 

అంటే భవిష్యత్తులో జగన్ ప్రభుత్వం గనుక తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవాల్సొస్తే సమస్య తనదాకా రాకుండానే రామోజి ఈ పని చేసినట్లు ప్రచారంలో ఉంది. మొత్తానికి  జగన్ దెబ్బకు పెద్ద వికెట్టే పడిపోయింది. భవిష్యత్తులో ఇంకెన్ని వికెట్లు పడిపోతాయో చూడాల్సిందే. ఎందుకంటే ఇంకా చాలా వికెట్లే ఉన్నాయి జగన్ పై బురద చల్లుతున్న మీడియా సంస్ధలు.

మరింత సమాచారం తెలుసుకోండి: