న్యాయదేవతకే అన్యాయం జరుగుతుంటే ఆ తల్లి ఎవరికి చెబుతుంది. లోకంలో మనుషులు చేసే నీచమైన పనుల వల్ల ఈ ధరణి కూడా కన్నీరు పెడుతుంది. ఎందుకంటే రాక్షసులకంటే ఘోరంగా ప్రవర్తించే ఈ మనుషుల భారాన్ని మోస్తూ ఇంకా వీరు చచ్చాక కూడా తన గర్బాన చేరడం అప్పటికే వీరి పాపపు భారాలతో మలినమైన దేహ కంపు రెట్టింపుగా మారి భూ మాతను కూడా కన్నీరు పెట్టిస్తుంది.

 

 

ఇకపోతే న్యాయం మరోసారి అన్యాయం అవుతుంది. ఈ మాట ఎందుకు వచ్చిందంటే వెటర్నరీ డాక్టర్ దిశ ఉదంతం తర్వాత మహిళలపై అత్యాచారం చేసిన వాళ్లను ఉరి తీయాలని డిమాండ్లు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ నెలలోనే నిర్భయ దోషులను కూడా ఉరి తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఊహించని విధంగా ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమంటే మంగళూరు జిల్లా పుత్తూరులో కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది.

 

 

ఈ కేసులోని ప్రధాన నిందితులైన గురునందన్, ప్రజ్వల్, కిషన్, సునీల్, ప్రఖ్యాత్‌లకు బెయిల్ లభించింది. నిజంగా ఈ ఘటన భరతమాత కన్నీరు పెట్టే ఘటనే. కాలేజీ అయ్యాక తోటి విద్యార్థినిని ఇంటికి తీసుకెళ్తామంటూ నమ్మించి ఈ ఐదుగురు మృగాళ్లు మార్గ మధ్యలో కదులుతున్న కార్‌లో రేప్ చేశారు. అంతే కాకుండా ఈ అమానుష ఘటనను వీరంతా వీడియో తీసి ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఆ వీడియో అనుకోని విధంగా వైరల్ కావడంతో.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.  

 

 

పోలీసులు కేసును నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. కాగా, ఇప్పుడు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నిరసనలు మిన్నంటాయి. ఏది ఏమైన ఒకరిద్దరిని శిక్షిస్తే వ్యవస్దలో మార్పు రాదు. తప్పు చేయాలనే ఆలోచన వస్తేనే చెడ్డి తడిచిపోవాలి ఇలాంటి కఠిన శిక్షలు అమలు చేస్తేనే సమాజంలో కొంత వరకైనా మార్పు వస్తుందంటున్నారు కొందరు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: