పిల్లలు.. అంటాము కానీ అల్లరి అని.. ఎంతో కష్టపడుతుంటారు ఈ కాలం పిల్లలు. అబ్బా మనం కష్టా పడలేదా ఏంటి అని మనకు అనిపిస్తుంది. కానీ ఈ కాలం పిల్లలు పడేంత కష్టం ఎవరు పడరు తెలుసా ? ఎందుకు అని ప్రశ్న రావచ్చు. అదే చెప్తున్నా.. మన కాలంలో మనం తల్లిదండ్రులతో తిట్టించుకొని, కొట్టించుకొని 9 గంటలకు బడికి తీరికగా వెళ్లే వాళ్ళము. అలాగే సాయింత్రం నాలుగు గంటల కళ్ల బడి అయిపోయేది. ఇంకేముంది నాలుగు గంటల నుండి ఇంట్లో అమ్మని నాన్నను బాగా సాతయిస్తూ.. ఊరంతా అలా ఓ రౌండ్ వేసే వాళ్ళము. 

 

కానీ ఇప్పుడు పిల్లలకు.. అంత ఆనందం లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు అయిపోయారు. ఇంకా పిల్లలను చూసుకునేందుకు సమయం ఎక్కడ ఉంటుంది. అందుకే పిల్లలు ఇంట్లో నిద్రపోడానికి తప్ప మిగితా సమయం అంత స్కూల్ లోనే ఉండేలా ప్లాన్ చేస్తారు. అంటే స్కూల్ వాళ్ళు కూడా తల్లిదండ్రుల వద్ద నుండి డబ్బు బనే లాగుతారు లెండి. అది వేరే విషయం. కానీ ఇప్పుడు పిల్లలు ఉదయం 7 గంటలకు స్కూల్ లో అడుగు పెడితే సాయింత్రం ఏడు వరుకు అసలు బయటకు వచ్చేకి ఉండదు. ఇంకా అలాంటి పిల్లలకు కాస్త సేద తీర్చుకోవాలి అంటే.. సంక్రాంతి సేలవలో, దసరా సేలవలో, వేసవి సేలవలో ఖచ్చితంగా రావాలి. 

 

అలాంటి సెలవల లిస్టే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలకు క్రిస్మస్, సంక్రాంతి సెలవులపై రాష్ట్ర విద్యాశాఖ ఈరోజు ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన మేరకు ఈనెల 24వ తేదీ నుంచి క్రిస్మస్ సెలవులు ప్రారంభం కానున్నాయి. జనవరి ఒకటితో ఈ క్రిస్మస్ సెలవులు ముగుస్తాయి. 

 

అలాగే జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు మొదలై 20వ తేదీతో ముగుస్తాయి. అదేవిధంగా ఇంటర్ బోర్డు తన వార్షిక ప్రణాళికలో జనవరి 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ప్రభుత్వ కళాశాలలకు సెలవులు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం పిల్లలు, విద్యార్థులు మాకు సెలవులు త్వరలో అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: