ఆర్టీసీలో మార్పుల విష‌యంలో సంస్థ యాజ‌మాన్యం కీల‌క‌ నిర్ణ‌యం తీసుకోవ‌డం ఖాయ‌మైంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.  గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ రీజియన్లలో కలిసి 1,000 బస్సులు రద్దు చేయడంతోపాటు 1334 అద్దె బస్సులు ప్రవేశపెడ్తున్న నేపథ్యంలో సంస్థ కొత్త నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.  గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో బస్సులు రద్దుచేయనున్న నేపథ్యంలో అదనంగా ఉండే సిబ్బందికి ప్రత్యామ్నాయ విధులు అప్పగించనున్నారు. ఈ నిర్ణయంపై విధివిధానాలు ఖరారుచేసి మార్గదర్శకాలు రూపొందించడానికి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆడ్మిన్‌ కన్వీనర్‌గా మిగతా ఈడీలు, ఫైనాన్స్‌ అడ్వైజర్‌ సభ్యులుగా కమిటీనీ నియమిస్తూ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. 

 

అమిత్‌షా నాకు ఫోన్ చేశాడు..నేనేమో ట్రంప్‌తో మీటింగ్‌లో ఉన్న‌..పాల్ సంచ‌ల‌నం

 

గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ రీజియన్లలో కలిసి 1,000 బస్సులు రద్దు చేయడంతోపాటు 1334 అద్దె బస్సులు ప్రవేశపెడ్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవశ్యకత ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్‌ సిబ్బందిని అదనపు విభాగాల్లో సర్దుతున్నట్లు పేర్కొన్నారు. డబుల్‌ డ్యూటీలు, ఓటీ డ్యూటీలను తీసేయడంతోపాటు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు నిర్వహించే విధులను అప్పగించనున్నారు. వీటితోపాటు కార్గో సర్వీసుల్లో వీరి సేవలు ఉపయోగించుకోనున్నారు. ట్రాఫిక్‌ రెవె న్యూ లీకేజీలు కాకుండా ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు వీరికి ట్రాఫిక్‌ బాధ్యతలు ఇవ్వనున్న ట్లు వెల్లడించారు. జూనియర్‌ అసిస్టెంట్ల కొరతతో అవుట్‌సోర్సిం గ్‌ సిబ్బందిని ఉపయోగిస్తున్న ఆర్టీసీలో అదనపు కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లను వినియోగించుకోనున్నారు. కండక్టర్లు, డ్రైవర్లలో సివిల్‌, ఎలక్ట్రికల్‌ డిప్ల్లొమా ఉన్న వారు ఎవరైనా ఉంటే వారిస్థానంలో అదనపు సిబ్బందిని ఉపయోగిస్తామని పేర్కొన్నారు. ప్రతిపాదనలను వారం రోజుల్లో కమిటీ అందించాలని ఆదేశించారు. ఐతే ఇందులో వయస్సుపైబడిన, అనారోగ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం వల్ల టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో సుమారు 3,600 మంది అదనపు సిబ్బందిని వివిధ విభాగాల్లో అడ్జస్ట్‌ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: