టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా సినిమా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు మొన్న ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఒకింత మిశ్రమ స్పందనను సంపాదించి ప్రస్తుతం బాగానే కలెక్షన్లు రాబడుతూ ముందుకు సాగుతోంది. యువ దర్శకుడు సిద్ధార్థ  తాతోలు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు నిర్మాణం మరియు పర్యవేక్షణ వహించింది రాంగోపాల్ వర్మ. ఆంధ్రప్రదేశ్ లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా, 

 

అలానే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు మరియు లోకేష్ పరిస్థితి ఎలా ఉందో కూడా తెలిపేలా ఒకింత సెటైరికల్ గా వర్మ ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. మొదట ఈ సినిమాకి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ నిర్ణయించగా, కొందరు టైటిల్ కి అభ్యంతరం చెప్పడంతోపాటు, సినిమా లో కూడా అభ్యంతరకరంగా కొన్ని సీన్స్ ఉన్నాయని, అందువలన సినిమాని నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించారు. అయితే చివరికి తన సినిమాకు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే టైటిల్ గా మర్చి, అన్ని వివాదాలను ఎదుర్కొని వర్మ దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 

 

కాగా ఈ సినిమాలో వర్మ చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ పై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే సినిమాలో తమ నాయకుడిని కించ పరచడంతో ఆగ్రహించిన పవన్ అభిమానులు, రామ్ గోపాల్ వర్మ మరణించారని ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ కోడూరుపాడు అనే గ్రామంలో ఒక ఫ్లెక్సీని కూడా వేయించారు. కాగా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆ ఫ్లెక్సీని వర్మ తన సోషల్ మీడియా మద్యం ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ, సినిమా అనేది కేవలం ఫన్ కోసం తీస్తాం అని, అందులో నటులను కొంత ఫన్నీగా చూపించినంత మాత్రాన వారిని కించపరిచినట్లు కాదని, కాబట్టి తనను అర్ధం చేసుకోవాలని కోరుతూ వర్మ ట్వీట్ చేసారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: