గత కొంతకాలంగా ఆంధ్ర రాజకీయాల్లో  జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఓ వైపు పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తుంటే... జనసేన కు ఉన్న  సోలో ఎమ్మెల్యే అయిన రాపాక వరప్రసాద్ మాత్రం జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా రాపాక ఈమధ్య పవన్ కళ్యాణ్ పై  చేస్తున్న వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మరోమారు జనసేన పార్టీ లోని కీలక నేత పై సంచలన ఆరోపణలు చేశారు జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. జనసేన లో కీలక నేత అయిన నాదెండ్ల మనోహర్ వల్లే పార్టీ నుంచి చాలామంది నేతలు పక్కకు తప్పుకుంటున్నారు వ్యాఖ్యానించడం ప్రస్తుత ఆంధ్రా రాజకీయాల్లో  చర్చనీయాంశంగా మారింది. 

 


 2019 ఎన్నికల తర్వాత జనసేన పార్టీనుండి  చాలా మంది నేతలు వెళ్లిపోయిన  విషయం తెలిసిందే. అయితే తాము  జనసేన పార్టీ నుండి వెళ్ళిపోవడానికి కారణం నాదెండ్ల మనోహర్ కారణమంటూ చెబుతున్నారని రాపాక వరప్రసాద్ ఆరోపించారు. జనసేన పార్టీకి సంబంధించిన అన్ని అంశాలను అధినేత పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ ఇద్దరు మాత్రమే సంపాదించుకున్నారని మిగతా వారు ఎవరికీ సమాచారం అందించరు అని   రాపాక వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా నాదెండ్ల మనోహర్ తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని రాపాక స్పష్టం చేశారు. అయితే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షకు హాజరుకాకపోవడం పై స్పందించిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్... అసెంబ్లీ సమావేశాల కారణంగానే పవన్ దీక్ష కు హాజరు కాలేక పోయాను అంటూ వివరణ ఇచ్చారు. 

 


 ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమాలు చేపడితే ప్రశంసించడం మంచి విషయమే కదా అంటూ రాపాక తెలిపారు. అయితే తాను పార్టీ మారాలి  అనుకొంటున్నాను అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని తాను ఎప్పుడూ జనసేన తోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ఉన్న పరిస్థితుల్లో పార్టీ మారడం అనేది సర్వసాధారరణమే అంటూ తెలిపారు. గతంలో రాజకీయ నేతలందరికీ రాజకీయ విలువలు ఉండేవని... పార్టీ మారిన నేతలను ప్రజలు కూడా వ్యతిరేకించేవారిని.. కానీ ఇప్పుడు రాజకీయాల్లో నేతలు మాత్రం రాజకీయ విలువలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీలు మారుతున్నారని... అటు జనాలు కూడా  పార్టీలు మారినా పట్టించుకోవడం లేదంటూ తెలిపారు రాపాక.

మరింత సమాచారం తెలుసుకోండి: