హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను ఇరవై నాలుగు గంటల్లో పట్టుకున్న పోలీసులు, పది రోజుల్లో ఎన్‌కౌంటర్ చేసి వారి చాప్టర్ క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఈ ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్ఆర్సీ, తదితర సంఘాలు న్యాయ విచారణ జరగాలని కోరడంతో.. వీరి అంత్యక్రియలు నిలిచిపోయాయి. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు.. నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఇదిలా ఉండగా మొదట వీరి మృతదేహాలను మహబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రిలో ఉంచగా.. అవి కాస్తా డీ-కంపోజ్ అవుతుండటంతో.. అక్కడ నుంచి డెడ్‌ బాడీస్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

 

 

ఇక పోతే గాంధీ ఆసుపత్రిలో ఉన్న మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతదేహాలు చెడిపోకుండా ఉండేందుకు వైద్యులు వేలాది రూపాయలను ఖర్చు పెట్టనున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఫోరెన్సిక్ నిపుణులు మృతదేహాలకు ఎంబాల్మింగ్ చేయనున్నారట. ఇందుకు గాను ప్రతివారం రూ.7500 విలువైన ప్రత్యేక ఇంజెక్షన్లను మృత దేహాలకు ఇవ్వనున్నారట. ఈ పక్రియ వల్ల డెడ్ బాడీస్ దాదాపు నాలుగు నెలల పాటు డీ-కంపోజ్ కాకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

 

 

ఇకపోతే వారానికి ఒకసారి ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. కాగా, హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు గాంధీ ఆసుపత్రిలోనే దిశ నిందితుల మృతదేహాలు ఉండనున్నాయని అధికారులు తెలిపారు.. ఇకపోతే మరణించిన మృతదేహాల విషయంలో ఇప్పటి వరకు దాదాపుగా ఇంత రాద్దాంతం ఎప్పుడు జరుగలేదు. అలాగే ఇంత ఖర్చు కూడా ఎప్పుడు చేయలేదు. కేసును తొందరగా ముగించిన తెలంగాణ ప్రభుత్వ అధికారులు వారి ఖననాన్ని కూడా అంతే త్వరగా అయ్యేలా చేస్తే బాగుండేది. కాని రోజు రోజుకు ఆలస్యం అవుతున్న కొద్ది వారిని భద్రపరడం ఖర్చుతో కూడుకున్నదిగా అవుతుంది. అంతే కాదు వారిని కన్న వారికి కూడా మానసిక క్షోభ ఎక్కువవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: