ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టులో నలిగిపోతున్న అయోధ్య వివాద స్థల సమస్య గత నెల సుప్రీం కోర్టు తీర్పుతో పరిష్కారం అయ్యింది. ఈ తీర్పు ద్వారా వివాదస్పద స్థలమైన 2.26 ఎకరాల స్థలము హిందువుల కి చెందుతుంది అని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అలాగే ముస్లింలకు దగ్గరలో ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే అయోధ్య రామ మందిర నిర్మాణానికి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

 

 ఈ నేపథ్యంలో దేశంలోని అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని రామమందిరం నిర్మాణానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణానికి దేశంలోని ప్రతి ఇంటి నుంచి 11 రూపాయలు అలాగే ఒక ఇటుకను విరాళంగా ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కోరారు. ప్రస్తుతం జార్ఖండ్లో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

త్వరలోనే అయోధ్యలో రామమందిరం మేము నిర్మిస్తాం దీనికి ప్రతి కుటుంబం తమ వంతుగా 11 రూపాయల అలాగే ఒక ఇటుక కూడా విరాళంగా ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని ఈ సమస్యకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ,అలాగే హోంమంత్రి అమిత్ షా చొరవతోనే దీనికి పరిష్కారం దొరికింది అని ఆయన చెప్పారు. తాజాగా ఈ తీర్పుపై నమోదైన రివ్యూ పిటిషన్లను దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు కొట్టిపారేసింది.

 

అలాగే ఈ ఎన్నికల ప్రచారంలో తాజాగా వచ్చిన పౌరసత్వం సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీపై ఆయన మండిపడ్డారు. పక్క దేశాల్లో ఎన్నో బాధలకు గురై భారత్ లో నివసిస్తున్న శరణార్థులకు పౌరసత్వం కల్పించాలని భావించిన ప్రధాని మోడీ కి కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: