తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ .. ‘ఈ నెల 12వ తేదీన ఐఆర్‌ఎస్‌ అధికారి, రాష్ట్ర ఆర్థిక వృద్ధి మండలి సీఈఓగా పనిచేసి మాజీ అయిన జాస్తి కృష్ణకిషోర్‌పై కొన్ని ఆరోపణలు వచ్చాయి .. పరిశ్రమల శాఖ  ఆయనపై ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అతన్ని  సస్పెండ్‌ చేసింది.

 

సహజంగా ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ ప్రభుత్వాలు సస్పెండ్‌ చేసి విచారణ జరుపుతాయి. ఇదేమీ ప్రభుత్వాలకు, అధికారులకు కొత్తేమీ కాదు. కానీ, ఈ విషయాన్ని  చాలా పెద్ద సమస్యగా, రాష్ట్ర, జాతీయ సమస్యగా చంద్రబాబుకు అనుకూలమైన పత్రికలు అన్యాయంగా, అక్రమంగా సస్పెండ్‌ చేశారని రకరకాలుగా కథనాలు రాస్తున్నాయి.గత ప్రభుత్వం అవినీతిమయం అయిపోయింది. రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు కూడా అవినీతికి పాల్పడ్డారు.

 

అవినీతిని అంతం చేయాలనే దృక్పథంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆధారాలు ఉంటే అధికారులను సస్పెండ్‌ చేసి విచారణ చేస్తుంది. విచారణలో రుజువు అయితే రిమూవ్‌ కూడా చేస్తుంది . గుమ్మడికాయల దొంగ ఎవరూ అంటే భుజాలు తడుముకున్నట్లుగా జాస్తి కృష్ణకిషోర్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి కాబట్టి గతంలో జగతి పబ్లికేషన్‌ కేసుల విచారణ టీమ్‌లో ఈయన సభ్యుడిగా ఉన్నాడని, జగతి పబ్లికేషన్‌ షేర్లు ప్రీమియం రేట్ల మీద వివాదం అయింది కాబట్టి దానిపై విచారణ జరిపి వ్యతిరేకంగా రిపోర్టు ఇచ్చాడని కక్షసాధింపు చర్యగా సస్పెండ్‌ చేశారని చంద్రబాబు చెబుతున్నారు.

 

చంద్రబాబు వ్యాఖ్యలతో కొంత బండారం బయటపడుతుంది. చంద్రబాబు ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ను  రాష్ట్రానికి ఎందుకు తీసుకువచ్చారు. తప్పు చేసి సస్పెండ్‌కు గురైన అధికారిని ప్రొటక్టు చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడంటే.. జగతి పబ్లికేషన్‌ విచారణ టీమ్‌లో సభ్యుడిగా ఉండి బహుశా బాబుకు అనుకూలంగా ప్రవర్తించి అయినా ఉండాలి.. బాబుకు అప్పటి నుంచి టచ్‌లో ఉండొచ్చు. బాబు ఏం చెబితే అది చేసి ఉండొచ్చు. పత్రికలు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే ఇదే పెద్ద సమస్యగా రాస్తున్నారు. ఆ రోజున కూడా జగతి పబ్లికేషన్‌కు సంబంధించి సాక్షిని ఎదుర్కోవడానికి చంద్రబాబు∙గందరగోళం చేశారు.

 

అనుకూల మీడియాతో రకరకాలుగా సార్వత్రిక ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పారు కథనాలు రాయించారు. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు, కక్షసాధింపు అలవాటు చంద్రబాబుకు ఉంది.అనుకూలమైన అధికారులను కీపోస్టుల్లో వేసుకొని, డిప్యుటేషన్‌ మీద తెచ్చుకొని అన్యాయాలు, అక్రమాలు చేసే ప్రభుత్వంగా చంద్రబాబు పాలన మిగిలిపోయింది.. అందువల్లే ప్రజలు తెలుగుదేశం పార్టీని తిరస్కరించారు. అంటూ అంబటి రాంబాబు మాట్లాడారు 

మరింత సమాచారం తెలుసుకోండి: