దేశవ్యాప్తంగా ఆడవారిపై అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిన్న దిశ సంఘటన తర్వాత కొత్త చట్టం తీసుకొని వచ్చారు. నేర నిరూపణ జరిగి న 21 పని దినాలలో నిందితులకు శిక్ష అమలు చేసే విధంగా చట్టం తీసుకొని వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయంపై దేశం మొత్తం జగన్ ప్రభుత్వాన్ని పొగుడుతున్నారు. గత నెలలో జరిగిన దిశ సంఘటన తర్వాత చాలా మంది న్యాయ చట్టం లో సమూల మార్పులు తీసుకొని రావాలని కోరారు.

 

దిశా సంఘటన తర్వాత ఉన్నావ్ లో కూడా ఇలాంటి సంఘటన జరగడంతో ఇంకా ఈ మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి అనుకోని వ్యక్తి నుంచి ప్రశంసలు వర్షం కురుస్తుంది. ఆయన ఎవరో కాదు రాష్ట్ర బిజెపి లో ఎంతో ప్రముఖులు అయిన ఇప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

 

ఈ మేరకు వెంకయ్య నాయుడు ‘మహిళపై లైంగిక వేధింపుల కేసుల్లో సత్వర విచారణ కోసం.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దిశ చట్టాన్ని ఆమోదించడం ఆనందంగా ఉంది. ఈ చట్టం సమర్థవంతంగా అమలైతే.. బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వానికి నా అభినందనలు అన్నారు. ఈ విధంగా తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

 

 అసలు మొన్నటి వరకు ఇటువంటి కేసుల విచారణకు 4 నెలల సమయం పడుతుండగా ఇక నుంచి మూడు వారాల్లో తీర్పు వస్తుందని అసెంబ్లీలో ప్రకటించారు జగన్. దీనికి సంబంధించిన కేసుల విచారణకు జిల్లాకు ఒక కోర్టును ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఈ కోర్టులలో కేవలం మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలు మాత్రమే విచారణ జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేలాగా చట్టం తీసుకొస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: