2014 ఎన్నికల సమయంలో బీజేపీ ప్ర‌చార సార‌థి న‌రేంద్ర మోదీ ప్రచార వ్యూహకర్తగా వ్యవహరించి... ఆయ‌న్ను ప్ర‌ధాని పీఠంపై కూర్చోపెట్ట‌డం ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన‌ ప్రశాంత్ కిశోర్ పేరు...ఇప్ప‌టికీ దేశంలో మారుమ్రోగిపోతోంది. మోదీ ప్రచారం కోసం అనేక వ్యూహాలు రచించిన ప్రశాంత్ కిశోర్ అనంత‌రం త‌న సొంత రాష్ట్రమైన బీహార్ ఎన్నికల్లో జెడియుకు పనిచేసి నితీష్ కుమార్‌ను స‌ర్కారును గ‌ద్దెనెక్కించారు. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం నిర్వహించి ఆ పార్టీని అధికారంలోకి తెచ్చారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ తరపున ప్రచారం నిర్వ‌హించి...జగన్‌ను ముఖ్య‌మంత్రి చేశారు. ఇలా పీకే హ‌స్త‌వాసి బాగుండ‌టంతో నేత‌ల స్టార్ తిరిగిపోతోంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ గెలుపుకోసం ఆయ‌న శ్ర‌మించ‌నున్నారు.

 

అమిత్‌షా నాకు ఫోన్ చేశాడు..నేనేమో ట్రంప్‌తో మీటింగ్‌లో ఉన్న‌..పాల్ సంచ‌ల‌నం

 

దేశ రాజ‌ధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండోసారి అధికారం చేజిక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా  ప్రశాంత్ కిశోర్‌ను ఢిల్లీ ఎన్నికల్లో త‌న తరపున ప్రచారం చేయాల‌ని కోరారు. దానికి పీకే ఓకే అన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. `ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ ఆధ్వర్యంలోని పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ-పాక్( ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ..I-PAC).. ఆప్‌తో కలిసి పనిచేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ప్రశాంత్ టీమ్‌ను సాదరంగా ఆహ్వానిస్తున్నాం` అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. 

 

ర‌క్తం మ‌రిగిపోయేలా తెలంగాణ‌లో మూడు ఎన్‌కౌంట‌ర్లు...జ‌గ‌న్ దిశ చ‌ట్టం..కేసీఆర్ షాక్‌...


70 మంది సభ్యులు గల ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్రశాంత్ కిశోర్ తో కలిసి పనిచేయబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో కేజ్రీవాల్ పొలిటిక‌ల్ అడుగుల‌పై మ‌రింత ఆస‌క్తి పెరిగింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సునామీ సృష్టించడం వెనుక ఉన్న ప్ర‌శాంత్ కిశోర్‌...ఇప్పుడు అదే మోదీకి వ్య‌తిరేకంగా ఢిల్లీలో షాకిస్తారా?  క‌మ‌లం వాడిపోయేందుకు ఆయ‌న వేసే ఎత్తుగ‌డ‌లు ఫ‌లిస్తాయా అనేది తేలాలంటే...మ‌రికొన్ని నెల‌లు ఆగాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: