కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం సుకన్య సమృద్ధి స్కీం. ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ కూడా ఇందులో ఒక భాగమే. ఈ స్కీంతో ఒక కుటుంబంలో ఇద్దరు చిన్నారుల పేరుపై ఈ ఖాతాలను తెరవొచ్చు. ఒకవేళ కవలలు పుడితే అప్పుడు ముగ్గురి పేరుపై కూడా సుకన్య యోజన ఖాతాను ప్రారంభించొచ్చు. ఈ స్కీంకు బ్యాంకుల్లోనూ, పోస్టాఫీసుల్లో ఈ సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 

 

అయితే పోస్ట్ ఆఫీస్ లో సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచినా వారికీ ఇది పెద్ద శుభవార్త... ఏంటి అనుకుంటున్నారా ? డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ తాజాగా పోస్టాఫీస్ స్కీమ్స్‌కు సంబంధించిన రూల్స్‌ను మార్పు చేసింది. దీంతో సుకన్య సమృద్ధి అకౌంట్ ఉన్న వారికి ప్రయోజనం కలుగనుంది. అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఆర్‌డీ అకౌంట్ ఉన్న వారికి కూడా ఈ లాభం చేకూరుతుంది.

 

కొత్త నిబంధనతో నాన్ హోమ్ పోస్టాఫీస్‌ బ్రాంచ్‌కు వెళ్లి చెక్‌‌బుక్ ద్వారా డబ్బు చెల్లించవచ్చు.  రూ.25,000కు పైన విలువైన చెక్‌లను ఇతర పోస్టాఫీస్ బ్రాంచ్‌లకు వెళ్లి డిపాజిట్ చేసేందుకు కస్టమర్లకు ఇప్పటి వరుకు అనుమతి లేదు. అయితే ఈ పోస్టాఫీస్‌లో సేవింగ్ స్కీమ్స్ ఉన్న వారికి ఈ ప్రయోజనం వర్తిస్తుంది.

 

సుకన్య సమృద్ధి అకౌంట్ సహా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, రికరింగ్ డిపాజిట్ అకౌంట్ వంటి వాటిలో ఇతర బ్రాంచులోలనూ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ చెక్‌బుక్ ద్వారా డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. 

 

అయితే సుకన్య సమృద్ధి యోజనలో దాచుకున్న డబ్బును ఆడ పిల్లకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఉన్నత చదువులు లేదా పెళ్లి కోసం అకౌంట్ నుంచి 50 శాతం డబ్బుల్ని వెనక్కు తీసుకోవచ్చు. మిగతా మొత్తాన్ని అకౌంట్ మెచ్యూరిటీ తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. 

 

ఆన్‌లైన్‌ ద్వారా కూడా అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేసే అవకాశం ఉంది. ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ ఫెసిలిటీని పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీకు ఆడపిల్లలు ఉంటె వెంటనే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లను తెరిచి మంచి భవిష్యేత్తును ఇవ్వండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: