పూరీలు.. అంటూనే అందరికి పని పూరి గుర్తొచ్చేస్తుంది. కానీ అవి పానీపూరీలు కాదు.. మాములు పూరీలు. ఉదయం లేవగానే ఎంతో ఇష్టంగా ఉదయం టిఫిన్ గా తినే పూరీలు అవి. ఎంతో రుచిగా ఉండే ఈ పూరీలు ఎంతోమందికి చేసుకునేకి రాదు. 

                               

అయితే ఈ పూరీలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకా చికెన్ తో అయితే ఇంకా ఇష్టంగా తింటారు. అంతా రుచిగా ఉండే ఈ పూరీలను ఎలా చెయ్యాలి అనేది చాలామందికి రాదు. అలాంటి వారు ఈ పూరీలు ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోని ఇంట్లో ట్రై చెయ్యండి. పూరీలు మెత్తగా పొంగి రుచితో అదిరిపోతాయి.

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

గోధుమ పిండి 2 కప్పులు,

 

ఉప్పు తగినంత,

 

నూనె 2 చెంచాలు,

 

నీళ్లు 1 కప్పు.

 

తయారీ విధానం..  

 

ఒక బౌల్ తీసుకొని అందులో కాస్త నూనె వేసి, ఆ తర్వాత తగినంత ఉప్పు కలిపినా నీరు పిండిలోకి కలపాలి. ఆలా పిండిని బాగా మెత్తగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టాలి. అనంతరం ఆ పిండిని చిన్న చిన్న ఉంటాలు చేసి ఆ ఉంటాలను పూరి కర్రతో అన్ని వైపుల చూసి రౌండుగా వచ్చేలా తిక్కాలి. తర్వాత ఆ రౌండ్ పూరీలను. అప్పటికే స్టవ్ అంటించి నూనె బాగా వేడి అయ్యే వరుకు ఆగి ఆ రౌండ్ పూరీలను అందులో వేసి వేంచి బయటకు తియ్యాలి. ఆ తర్వాత ఆ వేడి పూరీలను మీకు ఇష్టమైన సాగుతోను.. లేదా చికెన్ తోను తింటే రుచి అదిరిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: