రాజు ర‌వితేజ‌...నిన్న‌టి వ‌ర‌కూ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కే స‌రిగ్గా తెలియ‌ని పేరు. ఆ పార్టీ నాయ‌కుల్లో కొందరికి తెలిసిన పేరు. పవన్ కళ్యాణ్ రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టే స‌మ‌యంలో  ఏర్పాటు చేసిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పటి నుంచి ఆయ‌న‌తో  సన్నిహితంగా ఉన్న వ్య‌క్తి. అయితే, తెర‌వెనుకే వ్యూహం కాబ‌ట్టి పెద్ద‌గా ఆయ‌నెవ‌రికీ తెలియ‌దు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న హాట్ టాపిక్‌. జన‌సేనానిని, ఆయ‌న రాజ‌కీయాన్ని క‌డిగి పారేయ‌డం ద్వారా రాజు సంచ‌ల‌నంగా మారారు. 'సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని పవన్ ప్రయత్నిస్తున్నాడు అంటూ క‌ల‌క‌లం సృష్టించే కామెంట్లు చేశాడు. అయితే, రాజు ర‌వితేజ విష‌యంలో...సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఆయ‌న్ను ముందే అల‌ర్ట్ చేశాడ‌నే విష‌యం ఇప్పుడు చర్చ‌నీయాశంగా మారింది.

 

ప‌వ‌న్ ప‌రువు తీసిన‌ రాజు ర‌వితేజ...ఓ రేంజ్‌లో ఆడుకున్న ఫ్యాన్స్‌


అదేంటి... ఇటు సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు, అటు ఆయ‌న ఫ్యాన్స్‌కు...ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ అంటే భ‌గ్గుమ‌నే వాతావ‌ర‌ణం ఉన్న త‌రుణంలో... ప‌వ‌న్ అంత‌రంగికుడు అయిన‌ రాజు ర‌వితేజ గురించి.... జ‌న‌సేనానితో ఏమాత్రం స‌ఖ్య‌త లేని రాంగోపాల్ వ‌ర్మ ఏ విధంగా హెచ్చ‌రిస్తాడు? అస‌లు వ‌ర్మ‌ ఏమ‌ని హెచ్చ‌రించారు? దాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకు పాటించ‌లేదు? అనేది స‌హ‌జంగానే వ్య‌క్త‌మ‌య్యే సందేహం.

 

అమిత్‌షా నాకు ఫోన్ చేశాడు..నేనేమో ట్రంప్‌తో మీటింగ్‌లో ఉన్న‌..పాల్ సంచ‌ల‌నం

ఆస‌క్తిక‌ర‌మైన ఈ ప‌రిణామంలోకి వెళితే..గ‌తంలో జ‌న‌సేనానికి- టీవీ9 సీఈఓగా ఉన్న స‌మ‌యంలో ప్ర‌ముఖ పాత్రికేయుడు ర‌విప్ర‌కాశ్‌కు మ‌ధ్య విమ‌ర్శ‌ల ప‌రంప‌ర సాగిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మ‌యంలో ప‌వ‌న్ ఓ ట్వీట్ చేశారు. ఓ పాత్రికేయుడితో ర‌విప్ర‌కాశ్ కాళ్లు మొక్కించుకుంటున్న‌ది ఆ వీడియోలో ఉంది. అయితే, ప‌వ‌న్ చేసిన వీడియో ట్వీట్‌పై రాంగోపాల్ వ‌ర్మ స్పందిస్తూ...`పవన్‌ కల్యాణ్‌ అది కొత్తేం కాదు. ఐదేళ్ల క్రితం వీడియో.. లక్షల సార్లు సర్క్యూలేట్‌ అయ్యింది. ఆ వీడియో పెట్టమని నీకు సలహా ఇచ్చిన వెధవలను పక్కన పెట్టేయ్‌. వాళ్లు రాజు రవితేజ కంటే చాలా ప్రమాదకరం’ అంటూ హిత‌వు ప‌లికారు. అలా రాజు ర‌వితేజ విష‌యంలో వ‌ర్మ ఆనాడే చేసిన కామెంట్లు ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

https://twitter.com/RGVzoomin/status/987747444590080000?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E987747444590080000&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Fnews%2Fmovies%2Frgv-suggest-pawan-kalyan-over-aides-1067273

 

మరింత సమాచారం తెలుసుకోండి: