భారత ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా గురించి మన దేశ ప్రజలకు ప్రత్యేకంగా వివరించవలసిన అవసరం లేదు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో మోడీ ఎంతో సంచలనంగా ప్రవేశపెట్టిన పెద్ద నోట్ల రద్దు మరియు జీఎస్టీ వంటి అంశాల తరువాత ఆయన చరిష్మా తగ్గిందని, ఈసారి ఎన్నికల్లో ఆయన గెలిచే అవకాశం చాలావరకు లేదని అప్పట్లో వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ, ఇటీవల జరిగిన దేశవ్యాప్త ఎన్నికల్లో బీజేపీ పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకోవడంతో పాటు మరొక్కసారి భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ పీఠాన్ని అధిష్టించారు. 

 

చాయ్ వాలా నుండి ప్రధాని వరకు సాగిన ఆయన జీవిత పయనం ఎందరికో ఆదర్శం అని చెప్పాలి. ఇక మోడీ ఎక్కడికి వెళితే అక్కడ జనసందోహం వెల్లువలా తరలి వస్తుంది. ఇక నేడు తన పర్యటనలో భాగంగా కాన్పూర్ లోని గంగా నదీ ఘాట్ వద్దకు చేరుకొని అక్కడి పరిసరాలను పరిశీలించేందుకు మోడీ వెళ్లారు. అయితే ఆ సందర్భంలో ఘాట్ వద్ద మెట్లు దిగుతున్న మోడీ, ఒక్కసారిగా కాలుజారి పడిపోయారు. ఆ ఘటనతో వెంటనే అప్రమత్తం అయిన సెక్యూరిటీ సిబ్బంది ఆయనను పైకి లేపడం జరిగింది. 

 

కాగా ఆ ఘటనలో ఆయనకు ఏమి జరుగలేదని తెలుస్తోంది. ఇక కాసేపటికి గంగ నది పై ఒకింత సరదాగా బోటు షికారు చేసిన మోడీ, తనకు ఏమి కాలేదని, ఎవరూ ఆందోనళనకు గురికావాల్సిన అవసరం లేదని ప్రజలను ఉద్దేశించి చెప్పారు. కాగా ఆ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతోంది. కాగా ఈ ఘటనలో మోడీకి ఏమి కాలేదని తెలియడంతో బిజెపి నాయకులు కూడా ఊపిరిపీల్చుకున్నట్లు సమాచారం. కాగా ఈ ఘటన అనంతరం పలువురు రాజకీయ నాయకులు మోడీని ఫోనులో వాకబు చేసినట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: