తెలుగుదేశం పార్టీ రాయలసీమలో ఏ విధంగా ముందుకి వెళ్తుంది...? ఇప్పుడు ఈ ప్రశ్నకు ఆ పార్టీ నేతలు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. రాజకీయంగా బలంగా ఉన్న వైసీపీ దెబ్బకు ఆ పార్టీ అక్కడ చుక్కలు చూస్తుంది.. చంద్రబాబు సొంత జిల్లా నుంచి ఒకప్పుడు పార్టీకి అన్ని విధాలుగా అండగా నిలిచిన అనంతపురం జిల్లా వరకు కూడా ఆ పార్టీకి భవిష్యత్తు కనపడటం లేదనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. జగన్ సంక్షేమ కార్యక్రమాల పట్ల సీమ ప్రజలు సంతోషంగా ఉండటమే కాకుండా జగన్ పై వారు పూర్తి నమ్మకంగా ఉన్నారు...

 

రాజకీయంగా కూడా జగన్ ఇప్పట్లో బలహీనపడే పరిస్థితులు ఎంత మాత్రం కనపడటం లేదు. దీనితో పార్టీ నేతలు కొందరు మంత్రులతో టచ్ లోకి వెళ్తున్నట్టు వ్యాఖ్యలు వినపడుతున్నాయి. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక కీలక నేతతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. తాము త్వరలోనే పార్టీలోకి వస్తామని జగన్ తో మాట్లాడమని వారు కోరుతున్నారట. ఇటీవల చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మంత్రిని కలిసిన మాజీ మంత్రులు ఇద్దరు... జనవరి తర్వాత పార్టీలోకి వస్తామని, భారీగా క్యాడర్ తో వస్తామని చెప్పారట.

 

మంత్రి కూడా దీనిపై సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం. పదవులు ఎలాగూ లేవు కాబట్టి మీరు రాజీనామా చేసే అవసరం లేదని... ఎప్పుడైనా సరే పార్టీలోకి రావొచ్చని, పార్టీ బలోపేతానికి మీరు కృషి చేస్తే జగన్ కచ్చితంగా మిమ్మల్ని గుర్తిస్తారని చెప్పారట. దీనితో ఆ నేతలు... జనవరి తర్వాత వస్తామని కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వాటిని పరిష్కరించుకుని వచ్చేస్తామని చెప్పారట.

 

ఇక ఇద్దరు జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా పార్టీలోకి వచ్చే ప్రయత్నాలో ఉన్నారని వైసీపీ నేతలకు తెలియడంతో వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారట. ఇక క‌డ‌ప జిల్లాకు చెందిన ఓ కీల‌క నేత కూడా టీడీపీకి రాజీనామా చేసి ఈ నెల 26న పార్టీలోకి చేరేందుకు రెడీ అవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: