ఖమ్మం జిల్లా నీటి కష్టాలను తీర్చేందుకు రెడీ అయ్యింది తెలంగాణ ప్రభుత్వం. సీతారామ ప్రాజెక్టుకు నీటి కొరత లేకుండా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దమ్ముగూడం వద్ద బ్యారేజ్‌ నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు క్యాబినెట్‌ కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేసింది. 


వృథాగా పోతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టేలా మరో బృహత్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ  ప్రభుత్వం. పాత ఖమ్మం జిల్లాలో గోదావరి 180 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది.  అయితే నదీ నీళ్లను మాత్రం సద్వినియోగం చేసుకోవడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దీంతో ఆ జలాలను వినియోగంలోకి తెచ్చేలా ప్లాన్ చేసింది తెలంగాణ సర్కార్. నీళ్లకు నీళ్లు, కరెంట్‌ ఉత్పత్తి ఇలా బహుళ ప్రయోజనాలు చేకూరేలా బ్యారెజ్‌ నిర్మించాలని డిసైడయ్యింది. ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం వద్ద బ్యారెజ్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. 3400 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టాలని కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. 63 మీటర్ల ఎత్తులో ఈ బ్యారేజీ నిర్మాణం సాగుతుంది. ఈ బ్యారెజ్‌తో 37 టీఎంసీల నీరు నిలువ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆరు మీటర్ల వెడల్పుతో, ఆరుకిలోమీటర్ల పొడవున ఈ బ్యారేజీ నిర్మాణం జరుగనుంది. ఈ బ్యారేజీని 70 రేడియల్ గేట్లను కూడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

 

బ్రిటీష్ ప్రభుత్వంలో 155 ఏళ్ల క్రితం దుమ్ముగూడెం ఆనకట్టను అప్పటి సర్ ఆర్ధర్ కాటన్ నిర్మించారు. ఇప్పటి వరకు అది చెక్కు చెదరలేదు. దశాబ్దాల క్రితమే హేవీ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టింది. అయితే గోదావరిలో వచ్చిన వరదలను తట్టుకుని నిలబడింది. ఆనకట్ట ప్రస్తుతం 4 మీటర్ల ఎత్తులో ఉంది. దీనిని 63 మీటర్ల ఎత్తుకు  పెంచాలనేది ప్రభుత్వం లక్ష్యం. ప్రస్తుతం 2 టీఎంసీల సామార్థ్యం ఉన్న బ్యారెజ్‌ను 37 టీఎంసీలకు పెంచనున్నారు. 

 


దుమ్ముగూడెం నిర్మాణంతో సీతారామ ప్రాజెక్టులో నీటి లభ్యత పెరగనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకూ పెద్ద రిజర్వాయర్ కూడా లేదు. ఇది పూర్తైతే...ఆలోటు కూడా తీరనుంది. సీతారామ ప్రాజెక్టులో నీళ్లు పెరగడంతో.. రెండు పంటలకు సాగునీరు అందివచ్చు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి రిజర్వాయర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌  ప్లాన్ ప్రకారమే జరుగగా..ఇప్పుడు దుమ్ముగూడెం బ్యారేజీ కూడా అదే తరహాలో సాగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: