ప్రస్తుతం ఉన్న కార్పోరేట్ విద్యా వ్యవస్థలు, పద్దతులు, తల్లి దండ్రుల ఒత్తిళ్ళు పిల్లల్ని ప్రాణాలు తీసుకునే స్థాయికి తీసుకువెళ్ళాయి. ఈ విషయంలో అసలు తప్పు తల్లిదండ్రులది కాగా ఆ తర్వాత చదువు చెప్పే టీచర్లది అవుతోంది. పిల్లల మానసిక పరిస్థితేంటో అర్థం చేసుకోకుండా..వారికున్న జ్ఞానం ఏపాటిదో తెలుసుకోకుండా చదువు విషయంలో అదే పనిగా ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఈ ఒత్తిళ్ళను కొంతమంది తట్టుకుంటున్నప్పటికి కొంతమంది పిల్లలు మాత్రం అటు తల్లిదండ్రులు, ఇటు పాఠశాలలో టీచర్లు పెట్టే మానసిక ఒత్తిడి తట్టుకోలే ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. అలాంటి సంఘటనే ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

 

తల్లిదండ్రులు మందలించారానే మనస్తాపంతో తెలంగాణలో టెన్త్ విద్యార్థిని యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది. చదువులో వెనకబడిందని తల్లిదండ్రులు మందలించడంతో బాలిక ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎడపల్లికి చెందిన బోర్గం శంకర్, అన్నపూర్ణ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. శంకర్ వ్యవసాయ పనులు చేసుకుంటూ కూతుళ్లను చదివిస్తున్నాడు. పెద్ద కూమార్తె స్నేహ లత (15) స్థానికంగా ఉన్న పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.

 

బాలిక చదువులో వెనుబడి ఉందని ఉపాధ్యాయులు చెప్పడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన స్నేహలత.. ఇంట్లో బాత్రూమ్ లో ఉన్న యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తర్వాత ఆపస్మారక స్థితికి చేరుకున్న బాలికను తల్లిదండ్రులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా చూసుకోవాల్సింది ముఖ్యంగా తల్లిదండ్రులే. అంతేకాదు పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా ఈ విషయంలో పిల్లలని ఒత్తిడి చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలి. లేదంటే చిన్నతనం లోనే అభం శుభం తెలీని కన్న బిడ్డలని నిర్ధాక్షణంగా తల్లిదండ్రులే పోగొట్టుకున్నవాళ్ళవుతారు. ఇలాంటి విషయాల్లో సమాజంలో కాదు ముందు మన ఇళ్ళల్లోనే మార్పు రావాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: