అవినీతి ఆరోపణల నేపధ్యంలో... రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన చంద్రబాబు హాయంలో అవినీతి చేసారని వ్యాఖ్యానిస్తూ... ఆయనను విధుల నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విచారణ వేగంగా చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని అవినీతి నిరోధక శాఖకు ఆదేశాలు జారి చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక అవినీతి మీద విచారణ పూర్తి అయ్యే వరకు ఆయన్ను అమరావతి విడిచి వెళ్లొద్దని కూడా సీఎస్‌ నీల౦ సహాని ఆదేశించారు.

 

అంత వరకు బాగానే ఉన్నా ఇక్కడ ఆయన్ను తెలుగుదేశం వెనకేసుకుని రావడమే ఆశ్చర్యంగా మారింది. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఆయన అవినీతి చేయలేదు, అవకాశం లేదు. అక్కడ టికెట్లు కొనడానికి మాత్రమే ఆయన ఉన్నారు అంటూ ఏవేవో వ్యాఖ్యలు చేసారు. అసలు ప్రభుత్వం చర్యలు తీసుకుంది అధికారి మీద, చంద్రబాబు ఒక రాజకీయ పార్టీ అధినేత ఆయనకు అంత ఆవేశం ఎందుకు అనే ప్రశ్నలతో పాటు కొన్ని అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు.

 

చంద్రబాబు కొంత మంది అధికారులకు పూర్తి స్వేచ్చ ఇచ్చారని, వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారని, ఇప్పుడు వారి మీద ప్రభుత్వం చర్యలకు సిద్దమైంది అంటున్నారు. ఇక లోకేష్ నిర్వహించిన ఐటి శాఖ, దేవినేని ఉమా నిర్వహించిన జలవనరుల శాఖ మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అక్కడి అధికారులను కూడా త్వరలోనే సస్పెండ్ చేసే అవకాశం ఉందని వారి మీద అవినీతి కేసులను పెట్టే అవకాశం ఉందని  తెలుస్తోంది.

 

అలాగే వారి అవినీతి బయటకు లాగే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఆ అవినీతి అంతా బ‌య‌ట‌కు వ‌స్తే త‌న‌కు, త‌న కుమారుడికి ఎంత డ్యామేజ్ అవుతుందో అని... అందుకే చంద్రబాబు కంగారు పడుతున్నారు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: