జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల పాలన అద్భుతంగా  గడిచిపోయింది. అయితే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు తన ఆరు నెలల పాలనలో బెస్ట్ ముఖ్యమంత్రి అనిపించుకుంటా అని తెలిపారు . ఇక  జగన్మోహన్రెడ్డి ఆరు నెలల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు మరెన్నో అభివృద్ధి పథకాలు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో మొత్తం 25 మంది మంత్రులు ఉండగా... వారిలో బెస్ట్ మంత్రులుగా ఎవరు పేరు తెచ్చుకున్నారని ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో  చర్చనీయాంశంగా మారింది. 

 

 

 అయితే ఆంధ్ర రాజకీయాల్లో మొత్తం  25 మంది జగన్  క్యాబినెట్ లో  మంత్రులు ఉన్నప్పటికీ ప్రజలకు తెలిసింది మాత్రం కొంత మంది పేర్లు మాత్రమే.  అనిల్ కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ,  కొడాలి నాని,  బుగ్గన రాజేంద్ర ప్రసాద్,  కురసాల కన్నబాబు... సహా ఇంకొంత మంది పేరు మాత్రమే తెరమీదకి ఎక్కువసార్లు రావడంతో వీరి  పేరు మాత్రం ప్రజలకు ఎక్కువగా తెలుసు... టిడిపి ఘాటైన కౌంటర్ ఇస్తూ విరుచుకుపడే మంత్రుల్లో కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. చంద్రబాబు ని బాగా తిట్టడం ద్వారా బాగా పాపులర్ అయ్యారు. అయితే ఈ  ఇద్దరు మంత్రులు  చంద్రబాబు సహా టీడీపీ నేతలపై  కాస్త గీత దాటి వ్యాఖ్యలు  చేశారు. ఇక కురసాల కన్నబాబు లాంటి మంత్రులు చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తూ ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్ ఇస్తున్నారు. 

 


 కాగా  జగన్ క్యాబినెట్ లోని బొత్స సత్యనారాయణ,  బుగ్గన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి వైసీపీలోకి చలాకీగా వ్యవహరించడంతో పాటు ప్రతిపక్షాలకు కూడా ధీటుగానే కౌంటర్ లు ఇస్తున్నారు. కానీ ఇద్దరు మాత్రమే ఎక్కడ  గీత దాటకుండా కౌంటర్ ఇస్తూ.. కీలకంగా  వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.  బాలెన్సింగ్ గా విమర్శలు చేస్తూ  ప్రతిపక్షాల విమర్శలు అన్నింటికీ  ఘాటుగా కౌంటర్ ఇస్తూ... ఇద్దరు మంత్రులు గా సరిగ్గా పని చేస్తున్నారు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. దీంతో వైసిపి మంత్రులందరిలో ఈ  ఇద్దరూ ది బెస్ట్ అని అనుకుంటున్నారా వైసీపీ నేతలు. ప్రజల్లో కూడా వీరిద్దరే  బెస్ట్ మంత్రులను అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: