దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దిశ ఎన్‌కౌంట‌ర్‌, అనంత‌ర ప‌రిణామాల్లో షాకుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఓవైపు, దిశా కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఎన్‌కౌంటర్‌పై కమిషన్ నియామకం, మృతదేహాల అప్పగింత వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల సర్టిఫైడ్ కాపీని శుక్రవారం అడ్వకేట్ జనరల్ బండా శివానందప్రసాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనానికి అందజేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల్లో.. తదుపరి ఆదేశాలు జారీచేసేవరకు మృతదేహాలను భద్రపర్చాలి అని స్పష్టంగా ఉన్నదన్న హైకోర్టు ... ఇక విచారణలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది.

 

అమిత్‌షా నాకు ఫోన్ చేశాడు..నేనేమో ట్రంప్‌తో మీటింగ్‌లో ఉన్న‌..పాల్ సంచ‌ల‌నం

 

అయితే, దిశ ఘటనలో ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురు నిందితుల మృతదేహాలను చెడిపోకుండా భద్రపర్చాలని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. గాంధీ ఆస్పత్రిలో మార్చురీలో ఉన్న నిందితుల డెడ్ బాడీలు పాడవకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దిశ నిందితుల డెడ్ బాడీలకు ప్రత్యేక ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఒకసారి ఇంజక్షన్ ఇస్తే వారం రోజుల వరకు అది పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు. డెడ్ బాడీలకు ఇచ్చే ఒక ఇంజక్షన్ ఖరీదు ఏడు వేల ఐదు వందలు రూపాయలు. కోర్టు ఆదేశాలు వచ్చే వరకు డెడ్ బాడీలను భద్రపరుస్తామని పోలీసులు చెబుతున్నారు. 

 

ప‌వ‌న్‌ను తిట్టుకొని... వ‌ర్మ‌ను మెచ్చుకుంటున్న ఫ్యాన్స్‌... రాజు ర‌వితేజ ఎఫెక్ట్‌

దిశకు మద్యం తాగించి, లైంగికదాడికి పాల్పడినట్టు నిందితులు పేర్కొన్న నేపథ్యంలో.. ఆమె కాలేయంలో ఆల్కహాల్ నమూనాలు ఉన్నట్టు శుక్రవారం వెల్లడైన ఫోరెన్సిక్ రిపో ర్టు ద్వారా తెలుస్తున్నది. దీంతో కేసులో ఎఫ్ఎస్ఎల్‌ రిపోర్ట్  కీలకంగా మారింది. దిశ డెడ్ బాడీలో ఆల్కహాల్‌ను ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. అటు నిందితుల డీఎన్ఏ రిపోర్టులోనూ కీలక అంశాలపై ఆరా తీస్తున్నారు. నిందితుల  పాత నేరాలకు  సంబంధించి చిట్టాను సైబరాబాద్ పోలీసులు తవ్వుతున్నారు. విచారణలో భాగంగా లారీ ఓనర్ ఇచ్చిన  సమాచారంతో ఐదు రోజులుగా  ఆధారాలు సేకరిస్తున్నారు. లారీ లోడింగ్-అన్  లోడింగ్  చేసే ప్రాంతాల్లో గతంలో ఎక్కడైనా  నేరాలకు  పాల్పడ్డారా  అనే అంశాలపై  కూపీ  లాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: