రాంగోపాల్ వర్మ సంచలన చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా సెన్సార్  విడుదలను నిలిపివేసి సినిమా పేరుని మార్చాలని నిర్ణయించి  అమ్మరాజ్యంలో కడపబిడ్డలు అన్న పేరుని నిర్ణయించి సినిమా ను విడుదల చేసారు.ఆ సినిమాలు లో ఎంతో మంది ప్రముఖుల డూప్ లను వాడి రాజకీయ సంచలనం సృష్టించాడు.ఆ  సినిమాపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు వర్మ ఒక పిచ్చి సినిమా చేశారని మండిపడ్డారు. ఈ సినిమా ద్వారా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

వాడికి ప్రశాంత వాతావరణం అంటే నచ్చదని తన కాంట్రవర్సీ పాత్రలతో సినిమా తీస్తే సినిమా రిలీజ్ అవ్వదని తాను ముందే చెబితే తమను అపహాస్యం చేశారన్నారు. నేను ముందునుండే మారమని చెప్పానని తరువాత అయినా  మార్పు చెందుతాడని అనుకుంటే లంచాలు ఇచ్చి ఆ సినిమా ఆపడానికి ప్రయత్నించామని ఆరోపణలు చేసారు. ఆయనకు ప్రేక్షకులు మంచి  గుణపాఠం చెప్పారని సంబరపడ్డారు. ప్రజల్లో శాంతిని ప్రచారం చేస్తున్న నన్ను అవమానపరిచాడు. అంతేకాదు యేసు ప్రభువును కూడా అవమానించాడు. చివరకు ఏమైంది అని మూవీ ఫ్లాప్ అయ్యింది అని వాడి గర్వం అణిగిపోయినదని సంతోషం వ్యక్తం చేసాడు.
మోసాలు, అబద్ధాలు ఆడి ఎన్నో చేసి పర్మిషన్ లేకుండా వీడియోలు, ట్రైలర్ రిలీజ్ చేశారన్నారని ఆరోపించారు.

 ఆయన నోరు విప్పితే అబద్ధాలే అని  పవన్ కల్యాణ్ ఎవరో తెలియదని, చంద్రబాబు,  లోకేష్ లపైనా కూడా అసభ్యకరమైన  చిత్రాలను చిత్రీకరించిన  వర్మకు బుద్ది వచ్చేలా ప్రేక్షకులు సమాధానము చెప్పారని ఓ చానెల్‌లో అన్నాడు. చెత్త ప్రవర్తన  మానుకొని దేవుడికి, నాకు, ప్రజలకు క్షమాపణ కోరితే మళ్లీ  దేవుడి మరియు నా ప్రార్థనతో సినిమాల్లో విజయం పొందొచ్చు అని సూచించారు. సినిమా ని  ప్లాఫ్  చేయడం విషయంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: