దొంగ‌తనాల గురించి సినిమాల్లో, సీరియ‌ల్ల‌లో లేదా ఇంకో రూపంలో కొన్ని సంఘ‌ట‌న‌లు చూస్తే...ఇలా జ‌రుగుఉతుందా అనే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. కానీ అలాంటి మైండ్ బ్లాంక‌య్యే ఘ‌ట‌న‌లు ఎక్క‌డో కాదు మ‌న హైద‌రాబాద్‌లోనే జ‌రుగుతున్నాయి. అది కూడా పొరుగు రాష్ట్రం నుంచి వ‌చ్చిన తెలివైన మూఠా రూపంలో. బెంగళూరులోని తిమ్మయ్య గార్డెన్ సమీపంలో నివసించే ఎస్‌రాజుకు గాయత్రి, కోకిల ఇద్దరు భార్యలు. వారితోపాటు దగ్గరి బంధువులు జ్యోతి, అనితతో కలిసి దొంగతనాలు, పిక్‌పాకెటింగ్ చేయడం పనిగా పెట్టుకొన్నారు. గాయత్రి నేతృత్వంలో.. రాజు డైరెక్షన్‌లో ము ఠా పనిచేస్తుంది. వీరంతా...బెంగళూరు నుంచి కుటుంబ సమేతంగా వస్తారు. త్రీస్టార్ హోటల్‌లో బసచేస్తారు. రద్దీ బస్సుల్లో పిల్లలతో ప్రయాణిస్తూ మహిళల దృష్టి మళ్లించి విలువైన వస్తువులను కొట్టేస్తారు. కేవలం పదిరోజుల్లోనే రూ.కోటి విలువైన వస్తువుల్ని కొట్టేసి దర్జాగా చెక్కేస్తారు. అలాంటి  ముఠా తాజాగా పోలీసుల చేతికి చిక్కింది.

 

 

ప‌వ‌న్ ప‌రువు తీసిన‌ రాజు ర‌వితేజ...ఓ రేంజ్‌లో ఆడుకున్న ఫ్యాన్స్‌

ఐదుగురు సభ్యులున్న ఈ గ్యాంగ్‌ చేసేది పిక్‌పాకెటింగ్ అయినా.. వీళ్లను చూస్తే దొంగలని ఎవరూ అనుమానించరు. సొంత ఊరు నుంచి  హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు వెళ్లి త్రీస్టార్ హోటళ్లలో బసచేస్తారు. నీట్‌గా తయారైవచ్చి రైళ్లు, బస్సు ల్లో ప్రయాణిస్తూ భరణాలు, నగదు దోచుకొంటారు. మహిళా ప్రయాణికులనే లక్ష్యంగా దోపిడీకి పాల్పడుతుంటారు.  ఏడాది జూన్ 29న జయలక్ష్మి అనే మహిళ సికింద్రాబాద్ నుంచి మెహిదీపట్నంకు బస్సులో ప్ర యాణిస్తుండగా.. ఆమె బ్యాగులోని 25 తు లాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యా యి. వెంటనే ఆమె ఆసిఫ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టి కరుడుగట్టిన పిక్‌పాకెటింగ్ గ్యాంగ్‌ను గుర్తించారు. 

 

అమిత్‌షా నాకు ఫోన్ చేశాడు..నేనేమో ట్రంప్‌తో మీటింగ్‌లో ఉన్న‌..పాల్ సంచ‌ల‌నం

ఈ గ్యాంగ్ ఒక్కో నగరంలో పదిరోజులపాటు బసచేసి దోపీడీలు చేస్తుంది. దోచిన సొత్తు విలువ కోటి రూపాయలకు చేరగానే అక్కడి నుంచి వెళ్లిపోతారు. వీళ్ల దొంగ‌త‌నం రూట్ సెప‌రేట్‌. బస్సులో ప్రయాణిస్తూ ఒక మహిళను దొంగతనానికి లక్ష్యంగా ఎంచుకొంటారు. సదరు మహిళను గ్యాంగ్‌లోని మహిళలు చుట్టుముడతారు. ఆ మహిళ దృష్టి మళ్లించేందుకు తమ చేతిలో ఉన్న చిన్నపిల్లలను కొద్దిసేపు పట్టుకోమంటూ వారికి ఇస్తారు. పిల్లలను పట్టుకోవడంలో బాధితులు దృష్టిపెట్టగానే.. వారి బ్యా గులో నుంచి విలువైన వస్తువులను కొట్టేస్తారు. పిల్లలను తీసుకొని థ్యాంక్స్ చెప్పి అనుమానం రాకముందే తర్వాతి బస్టాప్‌లో దిగి కనిపించకుండాపోతారు. దొంగిలించిన సొత్తును గ్యాంగ్ సభ్యుడొకరికి ఇచ్చి పంపించేస్తారు. అనంతరం విడివిడిగా విడిది హోటల్‌కు చేరుకొంటారు. హోటల్‌లో దర్జాగా గడుపుతూ చూసేవారికి గొప్పింటివారిగా కనిపించేలా వేషభాషలు మార్చుకొంటారు. దొంగిలించిన నగలను కుదువపెట్టగా వచ్చిన డబ్బుతో విలాసవంతంగా గడపుతారు. ఐదుగురు సభ్యులున్న ఈ గ్యాంగ్‌లో సునీత మినహా మిగతా నలుగురిని అరెస్ట్ చేసి 35 తులాల బంగారు ఆభరణాలు, రూ.ఎనిమిది లక్షలు స్వాధీనం చేసుకొన్నారు. ఆసిఫ్‌నగర్, లంగర్‌హౌస్, హుమాయూన్‌నగర్, ఎస్సార్‌నగర్, సైఫాబాద్, నల్లకుంట, నాంపల్లి, నాచారం, బాలానగర్, హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని పిక్‌పాకెటింగ్ కేసుల్లో సొత్తును పోలీసులు రికవరీ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: