మాజీ మంత్రి , తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పప్పు అలియాస్ నారా లోకేశ్ మంగళగిరి మాడా గా మిగిలిపోయారని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజా రెడ్డి ఎద్దేవా చేశారు. చరిత్ర సృష్టించాలని తాను మంగళగిరిలో పోటీచేసి ఓడిపోయానని నారా లోకేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చరిత్ర సృష్టించాలంటే దమ్ము ధైర్యం ఉండాలన్నారు.  అవి ఒక్క జన నాయకుడు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికే  సాధ్యమన్నారు. లోకేష్ ను మంగళగిరి ప్రజలు పప్పును కాస్త మంగళగిరి మాడా గా మార్చారని ఆమె దుయ్యబట్టారు. 

ఆరు నెలల్లో తమ అవినీతి నిరూపిస్తామని సీఎం వైస్ జగన్ చెప్పిన మాట వాస్తవమే అని కానీ ప్రజలకు అందించాలనుకున్నా సంక్షేమ పథకాల గురుంచి ముఖ్యమంత్రి  ఆలోచిస్తూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన అవినీతి పై దృష్టి పెట్టలేదని ఆయన చంద్రబాబు అవినీతి పై దృష్టి పెట్టుంటే ఈపాటికి తండ్రి కొడుకులు ఇద్దరు ఊచలు లెక్కపెట్టేవారని ఆమె ఎద్దేవా చేశారు. అమెరికాలో బీర్లు తాగుతూ అమ్మాయిలతో జల్సాలు చేయడం, ఇంట్లో పనిమనిషికి కడుపు చేయడం ఇవేనా మీ తల్లి దండ్రులు నిన్ను క్రమశిక్షణతో పెంచడం అని  సూటిగా ప్రశ్నించారు.

గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు ముగ్గురు ఎమ్మెల్యేలు మొత్తం ఐదు మంది  ప్రజా నిధులు మహిళలపై వేధింపులకు  పాల్పడ్డారని  ఏడీఆర్  ( అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్  ) వేదికలో తెలియజేసిన తప్పు చేసిన వాళ్లని నిర్ధాక్షిణ్యంగా  పార్టీ నుండి సస్పెండ్ చేయకుండా వాళ్లను వెనకేసుకుని రావడంలో ఆంతర్యం ఏంటి అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు.  కాబట్టే ఈరోజు మీకు పసుపు కుంకుమ పూసి మూల కూర్చున పెట్టారని విమర్శించారు.  అసెంబ్లీ గేటు వద్ద  ఒక ప్రభుత్వ ఉద్యోగి పై నారా లోకేష్ చేయి చేసుకోవడం  వీళ్లా రాజనీతి.. రాజ్యాంగాలు గురించి మాట్లాడేది? ఇంతకన్నా అనైతికం ఇంకేమన్నా ఉందా. పైగా విలువల గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు,

మరింత సమాచారం తెలుసుకోండి: