ఆయేషా మీరా.. ఈరోజు ట్రేండింగ్ టాపిక్. 2007లో విజయవాడలో ఆయేషా మీరా తాను ఉంటున్న హాస్టల్ లోనే హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఆమె హత్యకు గురై దాదాపు 12 ఏళ్ళు అయిన అసలు నిందితులు ఎవరో ఇంతవరుకు తెలియలేదు. దీంతో ఈరోజు ఆమె డెడ్ బాడీకి నేడు రీపోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. 

                         

అయితే తన కూతురు కేసును సీబీఐ డీల్ చేయడాన్ని ఆయేషా తల్లి శంషాద్ బేగం స్వాగతించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ద్వారానైనా వారికీ న్యాయం జరుగుతుందని బావిస్తున్నట్టు ఆమె చెప్పారు. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్‌‌పై, ఎమ్మెల్యే రోజాపై అయేషా తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

                       

దీంతో ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్‌ రోజా స్పందిస్తూ.. ఆయేషా తల్లి వెనుక ఎవరో ఉండి ఇలా మాట్లాడించారని, గతంలోనే ఓ నిందితుడ్ని అరెస్ట్ చేశారని.. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయమని చెప్పారని.. విచారణ కూడా జరుగుతోంది అని అన్నారు. విచారణ జరుగుతున్న విషయానికి న్యాయం చేయలేదు, నేరస్థులు తెలుసు అంటే తనకు తెలిసిన నేరస్థులు టీడీపీ వాళ్లకు, పోలీసులకు, చట్టాలకు తెలియదా అని రోజా ప్రశ్నించారు.


 
కాగా ఆయేషా తల్లి మాటలు చాలా బాధాకరమని, అయేషా మీరా ఘటన జరిగిన సమయంలో ఆమె మహిళా అధ్యక్షురాలిగా ఆ కుటుంబానికి అండగా ఉన్నట్టు రోజా గుర్తు చేశారు. అంతేకాదు ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం కోసం రాష్ట్రమంతా తిరిగి పోరాటం చేశానని ఆమె అన్నారు. ఇన్ని చేసిన ఆమెను ఇప్పుడు తనపై ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: