సాధారణంగా అమ్మాయిలకు యవ్వనంలోనే గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం అమ్మాయిలకు 11 ఏళ్లు, అబ్బాయిలకు 12 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాతనే శరీరంలో మార్పులు ఏర్పడతాయి. ఒకవేళ  8 నుంచి 9 ఏళ్ల వయస్సులో దేహంలో అలాంటి మార్పులు ఏర్పడితే అది అనారోగ్య యుక్తవయస్సు అంటారని డాక్టర్స్  చెబుతున్నారు..

 

 

ఇకపోతే కొన్ని కేసుల్లో హార్మోన్ డిజార్డర్ వల్ల కూడా శరీర ఎదుగదలలో మార్పులు రావచ్చు. ఇకపోతే వయస్సుతో సంబంధం లేని ఓ బాలిక గర్భం దాల్చింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నమ్మలేని నిజం. ఆమె పేరు లీనా.. ఐదేళ్ల వయస్సులో గర్భవతి ఎలాగైందనేది ఇప్పటికి అంతు చిక్కడం లేదు. దీంతో ప్రపంచంలో అత్యంత చిన్న వయస్సులోనే తల్లైన రికార్డు లీనా పేరు మీదే ఉంది. ఇక వివరాలు తెలుసుకుంటే పెరులోని అండేస్‌ అనే చిన్న గ్రామంలో జరిగిన ఘటనలో, లీనా మెడినా అనే బాలిక వయస్సు ఐదేళ్ల ఉన్నప్పుడు పొట్ట పెరగడం మొదలైందట.

 

 

దీంతో ఆమె తల్లిదండ్రులు.. కడుపులో కణితి ఉందని అనుమానించారు. వైద్యపరీక్షల తర్వాత అది కణితి కాదు.. గర్భం అని తెలిసి ఆశ్చర్యపోయారు. అప్పటికే ఆమె ఏడు నెలల గర్భంతో ఉందని వైద్యులు తెలిపారు. ఇక 1939, మే 14న లీనా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.. ఇకపోతే లీనాకు మూడేళ్ల వయస్సు నుంచే రుతుస్రావం జరిగేదని ఆమె తల్లి పేర్కొంది. అది గుర్తించిన కొద్ది నెలల్లో లీనా గర్భం దాల్చి బిడ్డకు జన్మనివ్వడం జరిగిందట. కొందరు వైద్యులు మాత్రం ఈ విషయంలో స్పందిస్తూ ఇది అసాధ్యమని, ఆ సమయంలో అందుకు అవసరమైన అవయవాలు కూడా సక్రమంగా ఎదిగి ఉండవని వాదించారు.

 

 

ఇకపోతే  లీనాను గర్భవతి చేసిన వ్యక్తి ఎవరు అనేది సస్పెన్స్‌గా మిగిలింది. పోలీసులు అనుమానంతో ఆమె తండ్రిని అరెస్టు చేశారు. అయితే, సాక్ష్యాలు లేకపోవడంతో అతన్ని విడుదల చేశారు. దీంతో ఆమె గర్భానికి తండ్రే కారణమా మరేమైనా కారణాలు ఉన్నాయా? అనే సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికీ ఆ విషయం ఇప్పటికి అంతుచిక్కని మిస్టరీగానే మిగిలింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: