చిన్న పిల్లలున్న ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతారు. ఎందుకంటే వారికి పాముకు, తాడుకు తేడా తెలియదు కాబట్టి ఈ ముక్కను చెప్పారు. ఇకపోతే ఇంట్లో ఏదైన ఎలక్ట్రానిక్ వస్తువూలు ఉంటే పిల్లలను ఓ కంట కనిపెట్టడం మాత్రం మరవ వద్దు. ఇక ఇప్పుడు ఓ తండ్రికి ఎదురైన అనుభవాన్ని చూస్తే దుస్తులు ఉతుకుతుంటే.. వాషింగ్ మెషీన్‌లో పిల్లాడు కనిపిస్తే ఎలా ఉంటుంది? చాలా భయం వేస్తుంది కదూ. ఇదిగో రష్యాకు చెందిన ఓ తండ్రికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. అతను వాషింగ్ మెషీన్‌లో దుస్తులు ఉతుకుంతుండగా అందులో పసివాడు కనిపించాడట. అంతే.. అతడికి గుండె జారినంత పనైంది. వెంటనే వాషింగ్ మెషీన్ స్విచ్ఛ్ ఆఫ్ చేసి ఆ పసివాడిని బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. కానీ, అతడికి మరో షాక్ ఎదురైంది.

 

 

ఎందుకంటే.. ఆ వాషింగ్ మెషీన్‌లో ఆ పసివాడు కనిపించలేదు. దీంతో అందులో ఉన్న దుస్తులన్నీ బయటకు తీసి చూశాడు. చివరికి అది తన కొడుకు టీషర్ట్ అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన అతడు.. వాషింగ్ మెషీన్‌లో పసివాడిని చూడగానే గుండె ఆగినంత పనైంది. అది టీషర్ట్ అని తెలిసే సరికి ఊపిరి పీల్చుకున్నా. ఈ ఫొటోను ఎవరైనా పోస్టు చేస్తే.. తప్పకుండా అది టీషర్ట్ అని చెప్పండి. లేకపోతే.. నాలాగే పొరపడితే వారి గుండె ఆగిపోతుంది’’ అని తెలిపాడు.

 

 

ఇకపోతే ఇలా అప్పుడప్పుడు జరిగే ఘటనలు.ఒక్కోసారి కుటింబీకుల్లో అనుకోని టెన్షన్‌ను రేకెత్తిస్తుంది. భయాందోళనకు గురిచేస్తుంది. ఇకపోతే ఇతడు పెట్టిన పోస్టు చూసిన నెటిజన్లు వివిధ సలహాలు ఇస్తున్నారు అదేమంటే ఇకపై టీషర్టులు ఉతికినప్పుడు నేరుగా కాకుండా లోపలి భాగాన్ని బయటకు వచ్చేలా తీసి ఉతకాలి. లేకపోతే అవి కలర్ పోతాయి. పైగా, ఇలాంటి గుండె ఆగే సందర్భాలు కూడా రావు. టీషర్టులపై ఉండే బొమ్మలు ఎక్కువ రోజు మన్నికతో ఉండాలంటే.. అదే మంచి పద్ధతి అంటూ.. వారి వాషింగ్ స్కిల్స్ చెబుతున్నారు. మరికొందరైతే.. మీ ఇంట్లో టీషర్టులు నువ్వే గుర్తుపట్టకపోతే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: