ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని ఎన్నికల తర్వాత అంతా మనవాళ్లే అన్న విషయం దృష్టిలో ఉంచుకోవాలి.... అర్హులైతే మన వ్యతిరేకులకు కూడా నవరత్నాలు అందాలి అని గ‌తంలో ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌..తాజాగా ఆ జాబితాలో ఎస్పీల‌ను కూడా జోడించారు. శాంతిభ‌ద్ర‌త‌ల విష‌యంలో ముఖ్య‌మైన ఎస్పీల‌కు సైతం కీల‌క స‌ర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల క‌లెక్ట‌ర్లు మ‌రియు ఎస్పీల‌కు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విందు ఇవ్వ‌నున్నారు. వ‌చ్చే మంగ‌ళ‌వారం రాత్రి ఇవ్వ‌బోయే ఈ విందులో అనేక ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి.

 

ప‌వ‌న్‌ను తిట్టుకొని... వ‌ర్మ‌ను మెచ్చుకుంటున్న ఫ్యాన్స్‌... రాజు ర‌వితేజ ఎఫెక్ట్‌


విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం, రాబోయే మంగళవారం రాత్రి అన్ని జిల్లాల‌ కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి విందు ఇవ్వ‌నున్నారు. ఈ విందులో ప‌లు ప్ర‌త్యేక‌త‌లు ఉన్న‌ట్లు స‌మాచారం. రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఇవ్వ‌బోయే ఈ విందులో జిల్లాకు ఒక టేబుల్ చప్పున 13 టేబుల్లు ఏర్పాటు చేయ‌నున్నారు.  ముఖ్యమంత్రి జగన్ ఒక్కో టేబుల్ వద్ద ఆగి ఆయా జిల్లా గురించి 10 నిమిషాల పాటు జిల్లా క‌లెక్ట‌ర్లు మ‌రియు ఎస్పీల‌తో చర్చించనున్నట్లు తెలుస్తోంది.  అన్ని జిల్లాల‌ కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఇచ్చే ఈ విందులో రాష్ట్ర మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నట్లు స‌మాచారం.

 

అమిత్‌షా నాకు ఫోన్ చేశాడు..నేనేమో ట్రంప్‌తో మీటింగ్‌లో ఉన్న‌..పాల్ సంచ‌ల‌నం
 

కాగా, సీఎం జ‌గ‌న్ ఇచ్చే ఈ విందుపై ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్రంలో చేప‌ట్టి అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలు, చేపట్టబోయే అంశాలపై విందు సమావేశంలో చర్చించనున్న‌ట్లు తెలుస్తోంది.  గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, పాలనలో పారదర్శకత, ఆరోగ్యశ్రీ, 104, 108 సేవలు, పౌర సరఫరాల డోర్ డెలివరీ,  వ్యవసాయం, పేదలకు ఇళ్లస్థలాలు, గృహ నిర్మాణం, ఇసుక స‌ర‌ఫ‌రా, మద్యం అమ్మ‌కాల తీరుపై ప్ర‌జ‌ల స్పంద‌న‌, నిషేధం విధించడం ఎలా? మైనింగ్ పాలసీ, ఎర్రచందనం అమ్మకం, పోలవరం ప్రాజెక్ట్ వంటి అంశాలు చ‌ర్చించనున్న‌ట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: