వెటర్నరీ వైద్యురాలైన దిశను అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి ఆపై ఆమెను సజీవదహనం చేశారు నలుగురు నీచులు. కనీసం ఆమె శరీరాన్ని ముట్టుకోనీకి కూడా లేకుండా పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు ఆ నీచులు. దీంతో యావత్ దేశం ఒక్కసారిగా కోపాన్ని పీకల మీదకు తెచ్చుకుంది. ఆ నిందితులను పోలీసులు గుర్తించి అరెస్ట్ చెయ్యగానే.. ప్రజలంతా ఒక్కసారిగా వచ్చి ఆ నీచులను మాకు అప్పగించండి మేము చంపేస్తాం అంటూ కామెంట్లు చేశారు. 

                

అయితే పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఆ నీచులను కేసు రేకంస్ట్రక్షన్ అంటూ ఘటన స్థలానికి తీసుకురాగా.. అక్కడ ఆ నీచులు పారిపోవడానికి ప్రయత్నించి పోలీసులపైనే దాడికి దిగారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నీచులపై ఎన్కౌంటర్ జరిపి చంపేశారు. ఎన్కౌంటర్ కు గురైన ఆ నిందితులు అక్కడే చచ్చారు.. అయితే వాళ్ళు ఎన్కౌంటర్ గురైనందుకు.. 

             

ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది. అయితే ఈ ఎన్కౌంటర్ పై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం కాగా కొన్ని చోట్ల నుండి ఎన్కౌంటర్ నిర్ణయం సరైనది కాదు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఓ మహిళా నాయకురాలు నిందితుల ఎన్కౌంటర్ సరికాదు అని చెప్పగా ఇప్పుడు ఏకంగా మంత్రే ఈ నిర్ణయం సరికాదు అని అంటున్నారు. 

 

మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అత్యాచారాల లాంటి నేరాలకు ఉరి శిక్ష వేయడం, కాల్చి చంపడం అనే శిక్షలు శాశ్వత పరిష్కారం కావని అయన అభిప్రాయపడ్డారు. దిశ లాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే.. మొట్టమొదట సమాజంలో మార్పు రావాలని అన్నారు. మరి మంత్రి ఈటల ఈ వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటి ?

మరింత సమాచారం తెలుసుకోండి: