జనసేన మాజీ ప్రధాన కార్యదర్శి రాజు రవితేజ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ కోసం తాను చాలా చేయాలని అనుకున్నానని కానీ క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీకి ఆదరణ లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలపై రాజు రవితేజ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జనసేన పొలిట్ బ్యూరో సభ్యుడు, పవన్ కు అత్యంత సన్నిహితుడైన రాజు రవితేజ జనసేన పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 
 
పవన్ అనవసరంగా కులాల గురించి మాట్లాడుతున్నారని రాజూ రవితేజ అన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతం మతాల ప్రస్తావన లేకుండా రాజకీయాలు చేయడం అని చెప్పారు. జనసేన పార్టీకి క్షేత్ర స్థాయిలో గుర్తింపు లేదని రాజు రవితేజ అన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోని నాయకులను కూడా పైకి రానివ్వటం లేదని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిలో చాలా మార్పు వచ్చిందని రాజు రవితేజ అన్నారు. 
 
పవన్ కళ్యాణ్ కోస్తున్నట్టు కూడా తెలియకుండానే మన గొంతు కోసేస్తారని రాజు రవితేజ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తన ఆలోచనలకు పూర్తి వ్యతిరేకంగా వెళుతున్నారని రాజు రవితేజ అన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం చేసిన ఆలోచనలను ఒక్కసారి కూడా అమలు చేయలేదని రాజు రవితేజ అన్నారు. మునుపటిలా పవన్ కళ్యాణ్ వైఖరి లేకపోవటం వలనే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. 
 
మనిషి నాశనం వివేకం నశించడంతోనే మొదలవుతుందని పవన్ కళ్యాణ్ లో వివేకం చచ్చిపోయిందని రాజు రవితేజ అన్నారు. పవన్ జీవితంలో ఒకప్పుడు పాండిత్యం, జ్ఞానం ఉండేవని దయ, కరుణ, మంచితనం హృదయంలో ఉండేవని అన్నారు. ఇప్పుడు అవి కాకుండా కుట్ర, మోసం, అబద్ధాలు, ద్వేషం ఉన్నాయని విమర్శలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: