ఏపీలో త్వరలో ఎన్నికల నగారా మోగనున్నదని తెలుస్తుంది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని, ఇందుకు గాను ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇదే కాకుండా రిజర్వేషన్ల ప్రక్రియ, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్దం చేస్తున్నామన్నారు.

 

 

అదే విధంగా రెండు విడతల్లో విశాఖ మెట్రో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాజధాని ఎక్కడ ఉండాలనే దాని పై కమిటి వేశామని, కమిటి నివేదిక తర్వాత రాజధాని పై స్పష్టత వస్తుందన్నారు. రాజధాని పై అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజధాని రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, అన్ని విధాలా ఆదుకుంటామని విశాఖలో పర్యటిస్తున్న మంత్రి బొత్స క్లారిటినిచ్చారు.

 

 

ఇకపోతే ఆరు నెలల పాలనలోనే మంచి సీఎంగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని, మేనిఫెస్టోలోని అంశాలే కాకుండా చెప్పనివి కూడా అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటిస్తోందని, భోగాపురం ఎయిర్‌పోర్టు రీటెండరింగ్‌ ఇంకా నిర్ధారణ కాలేదని వివరించారు. ఇక ప్రజా సమస్యలపై చర్చ జరగనివ్వకుండా రాద్ధాంతం చేస్తూ సభా సమయాన్ని వృథా చేస్తున్న. చంద్రబాబుకు రోజురోజుకు అసహనం పెరిగిందన్నారు. అందుకే శాసనసభను సజావుగా జరగనివ్వడం లేదనిన్నారు.

 

 

ఇదే కాకుండా మార్షల్స్, ఉద్యోగులపై టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తున్నారని,  గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రమంతా అవినీతి తాండవించిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాడని, కాంట్రాక్టులు, పథకాల పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టారీతిగా ప్రజాధనాన్ని దోచుకున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు.. ఇకపోతే ఇప్పటికే అమరావతిలో భవనాల నిర్మాణాలు ఏ దశలో ఉన్నా వాటిని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: