తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖకు  రాష్ట్రానికి ప్రభుత్వ వైద్య కళాశాలలను జిల్లాల వారీగా కాకుండా, జనాభా ప్రాతిపదికన కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అధికారులు కొత్త వైద్య కళాశాలల ప్రతిపాదనలను కేంద్రానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు  పంపించారు. ఏ జిల్లాలో అయినా  భారతీయ వైద్య మండలి, కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నిబంధనల ప్రకారం ప్రభుత్వ వైద్య కళాశాల లేదా ప్రైవేటు వైద్య కళాశాల లేకపోతే ఆ జిల్లాకు కేటాయించాలని ఉంది. ఈ లెక్కన చుస్తే  ప్రభుత్వ వైద్య కళాశాలలు లేని విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు లేకపోయినా ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. నిజానికి ఈ నిబంధనల ప్రకారం అక్కడ ఏర్పాటుకు వీల్లేదు. కానీ, కేంద్రాన్ని ఇలా జిల్లాల ప్రాదిపదికన కాకుండా, జనాభా ప్రాతిపదికన కేటాయించాలని  కోరింది.

 
వైద్య కళాశాలలు ఏపీలో వెనుకబడిన ప్రాంతాల్లో  ఏర్పాటు చేయదలిచామని.. రాష్ట్ర అధికారులు వీటిని పాడేరు వంటి గిరిజన ప్రాంతంలోనే కాకుండా.. గురజాల, మార్కాపురం వంటి వెనుకబడిన ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో  తెలిపారు. ఇలా రాష్ట్రంలో మొత్తం ఏడు ప్రాంతాల్లో (మచిలీపట్నం, పులివెందుల, ఏలూరు, విజయనగరం, గురజాల, మార్కాపురం, పాడేరు) పెట్టాలని సంకల్పించినట్లు వివరించారు.

 

ఇందుకు కేంద్రం ఆర్థికంగా సహకరించాలని కోరారు. ఇవి సాకారమైతే వెనుకబడిన ప్రాంతాల్లో స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయని.. వైద్య సీట్లు పెరుగుతాయని, పేద వర్గాలకు మెరుగైన వైద్యం చేరువవుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. తమిళనాడులో ఏడు కొత్త వైద్య కళాశాలలను జిల్లాలు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ మంజూరు చేశారని,  దీనిపై అధికారులు  వీటి పరిధిలో జనాభాతో పోలిస్తే, ఏపీలో కొత్తగా తలపెట్టిన వైద్య కళాశాలల పరిధిలో జనాభా ఎక్కువగా ఉందని తెలిపారు. అందుకే జిల్లాల వారీగా కాకుండా జనాభా ప్రాతిపదికన కేటాయించాలని కోరారు.  మళ్లీ వైద్య విద్యాశాఖ అధికారులు ఈనెల 16న ఢిల్లీకి వెళ్లి లేఖ ఇవ్వనున్నారు.


రాష్ట్రంలో  2014 నుంచి 2019 వరకూ ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల కూడా ఏర్పాటు కాలేదు.టీడీపీ అధినేత చంద్రబాబు  2014 ఎన్నికల సందర్భంలో  వైద్య కళాశాలలు లేని జిల్లాల్లో కొత్తవి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు ఎన్నికలకు ఆర్నెల్ల ముందు విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో  ఏర్పాటుచేస్తున్నామని మొక్కుబడిగా జీఓలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు ఆ రెండు జిల్లాల్లోనూ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు కేంద్రానికి సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ప్రతిపాదనలు పంపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: