మీరు ఉద్యోగానికి వెళ్లేటప్పుడు పబ్లిక్ తిరిగే దారిలోనే వెళ్ళండి ఒంటరిగా కొత్త దారిలో వెళ్ళకండి. 
కాలేజ్ విద్యార్థులు నైట్ లో బర్త్ డే పార్టీ లకు మరియు వివిధ పార్టీలకు మీ స్నేహితులు పిలిచిన వెళ్ళకండి.ఒక్క వెళ్ల కచ్చితంగా వెళ్ళాలి అని వుంటే వెంటా పేరెంట్స్ లో ఒక్కరిని తప్పకుండా తోడు తీసుక వెళ్ళండి.
మహిళలు ఒక్క వేళా ఏదైనా ఫణి మీద వెళ్ళి రావడం లెట్ ఐ ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే కుటుంబసభ్యులు అందుబాటులో వుంటే వారికి రమ్మని చెప్పండి.ఎవరైనా వచ్చిన తరువాతే బయలుదేరండి.
మీరు వెకిల్స్ పార్క్ చేసేటప్పుడు సీసీ కెమెరాలు ఉన్నదగ్గరే పార్క్ చెయ్యండి.
మీ కు ఎవరిమిదనైన సందేహం ప్రమాదకరం అనిపిస్తే వేటనే 100 ఫోన్ చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.వారు మీకు సహాయపడుతారు..
మహిళలు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒంట్టిమీద నగలు ఎక్కువగా వేసుకోకండి..
మహిళలు ముక్యంగా బయటకు వెళ్ళేటప్పుడు అసభ్యకరంగా ఉన్న బట్టలను వేసుకోకండి.ఫుల్ డ్రెస్ వేసుకోకండి.
ముఖానికి కచ్చితంగా స్క్రాప్ ధరించండి.
మీరు దూరంగా కాని దగ్గరలో కాని షేర్ ఆటోలో ప్రయనిచేటప్పుడు ఆటోలో ప్రజలు వుంటే నే ఆటోలో వెళ్ళండి ఒంటరిగా షేర్ ఆటోలో వెళ్ళకండి.
మీరు ప్రయనిచేటప్పుడు మీ వెంట ఏదైనా స్ప్రే బట్టిల్ తప్పక ఉంచుకోండి.
మీ వెకిల్స్ ఏదైనా ప్రబ్లేమ్స్ వస్తే బస్ లో వెళ్ళండి వెహికిల్ అక్కడే వదిలెయ్యండి.మీరు ఎవరికోసమైన అగాలిసి వస్తే పబ్లిక్ ఎక్కువగా వున్న ప్లేస్ లోనే ఉండండి,ఒంటరిగా వుండకండి.  ప్రమాదంగా ఉంది అనిపిస్తే మీరు ఖచ్చితంగా 100 సమాచారాన్ని అందించండి వారు మీకు సేఫ్ జోన్ లో తీసుకవెళ్తారు.


జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసినా అదనపు కట్నం కోసం కాల్చుకుతినే భర్త. విధుల నిర్వహణలో పనిచేసే చోట లైంగికంగా వేధించే బాసుకాలేజీలో ప్రేమ పేరిట విసిగించే తోటి విద్యార్థులు.  ఇలా అడుగుకో మగాడు, మహిళ రక్త, మాంసాలు నంజుకుతినే మృగాడు. నడి రోడ్డు మీద ఆడది స్వేచ్ఛగా తిరిగే ఆస్కారం లేదు. బయటకు వెళ్లిన మహిళ సురక్షితంగా ఇంటికి తిరిగి చేరుకునే వరకు కుటుంబ సభ్యులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుంటున్నారు. అదును దొరికితే చాలు ఆడదానిపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనే ప్రియాంక రెడ్డిని దారుణంగా బలత్కరించి చంపడం రెండు తెలుగు రాష్ట్రాల మహిళ సమాజాన్ని కలిచివేస్తుంది.ఈ అకృత్యాలకు అంతంలేదా..? మగువకు రక్షణ లేదా..? అంటే రాజ్యాంగంలో ఎన్నో చట్టాలు, ఐపీసీలో మరెన్నో సెక్షన్లు ఉన్నాయి. వాటి గురించి మహిళలకు ఎంతవరకు అవగాహన ఉంది..? వాటి గురించిన చైతన్యం లేకపోవడమే మహిళల పాటిల శాపంగా మారిందనీ  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు, శైలజా రెడ్డి వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ధైర్యంగా 100కు ఫోన్ చేయాలని సూచించారు. షీ టీమ్స్ నంబర్స్ ఎప్పుడు అందుబాటులో పెట్టుకోవాలని ఆమె సూచించారు. అందుకే ప్రతి ఒక్క మహిళా కనీస చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో శ్రేయస్కరం అని ఆమె వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో100 డయల్ చేయడం మహిళలు మరువ కూడదని ఆమె తెలిపారు.

లైంగిక వేధింపుల చట్టం..
మహిళలు, తాము పనిచేస్తున్న చోట లైంగిక వేధింపులకు గురైతే వారి ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్లే లెక్క! కావాలని శరీ రాన్ని తాకడం, సైగలు చేయడంతోపాటు మాటలు, పాటలు. లాంటి వన్నీ లైంగిక వేధింపుల కిందికి వస్తాయి. వీటిని అరికట్టేందుకు 1997లో సుప్రీంకోర్టు విశాఖ కేసులో కొన్ని సూచనలు చేసింది. (ఏఐ ఆర్ 1997 సుప్రీంకోర్టు 3011) ఈ తీర్పులోని అంశాలను మార్గదర్శ క సూత్రాలుగా పాటించడం సంస్థలకు తప్పనిసరైంది.

అత్యాచార యత్నం చేస్తే..
 ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం సదరు వ్యక్తికి కనిష్ఠంగా ఐదేళ్లు, గరిష్ఠంగా ఏడేళ్ల జైలుశిక్ష విధించే అవకాశముంది.
అత్యాచారం రుజువైతే… ఐసీపీ సెక్షన్- 376 ప్రకారం కనిష్ఠంగా ఏడేళ్లు, గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.
కిడ్నాప్ చేస్తే లైంగిక అవసరాల కోసం మహిళలను కిడ్నాప్ చేసే ఐపీసీ 366 సెక్షన్ కింద పదేళ్ల జైలు విధిస్తారు.

 మనోవర్తి- భర్తతో గొడవపడి..

వేరుగా ఉంటున్న మహిళలకు ఐపీసీ సెక్షన్- 125 ప్రకారం కోర్టు మనోవర్తిని మంజూరు చేస్తుంది. మహిళలు సంబంధిత మేజిస్ట్రేట్కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. ఉచిత న్యాయ సాయం… మహిళలు లైంగికంగా, శారీరకంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా న్యాయం కోసం కోర్టును ఆశ్ర యిస్తే వారికి ఉచిత న్యాయ సాయం అందుతుంది.గృహహింస నిరోధక చట్టం- 2005
ఈ చట్టం ప్రకారం మహిళలు రక్షణ కోసం పోలీసు, రక్షణ అధికారులు, స్త్రీ శిశు సంక్షేమ పథక సంచాలకులు, గుర్తింపు పొందిన సర్వీసు ప్రొ వైడర్లు మొదలైనవారిని ఆశ్రయించవచ్చు. రక్షణ, నివాసం, ద్రవ్యం, సంతాన, నష్టపరిహారం మొదలైనవి పొంద వచ్చు. ప్రాజెక్టు డైరెక్టర్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆశ్ర యిస్తే సమస్యపై స్పందన లభిస్తుంది. ఈ చట్టాన్ని భారత ప్రభుత్వం 2005 లో ఇళ్లలో మహిళలపై జరిగే మాన సిక, శారీరక హింసను అరికట్టేందుకు అమల్లోకి తెచ్చింది. 

చట్టప్రకారం, శారీరకంగా,.
లైంగికంగా, మానసి కంగా మహిళలకు హాని కలిగించడం, భావోద్వేగపూరిత మాటలతో దూషించడం, వరకట్నం కోసం వేధించడం, హింసించడం, ఆమె ఆస్తులను స్వాధీ నపరుచుకోవాలని చూడడం, ఆమెకు సంబంధించిన వ్యక్తిని లొంగదీసుకోవడం, ఆమె తరఫువారిని బెదిరించడం లాంటివన్నీ నేరాలే! బాధితురాలు (ఫిర్యాదుదారు)కు లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుతుంది. ఒకవేళ అడిగితే షెల్టర్ హోంలో రక్షణ కల్పించాలని సెక్షన్-6 చెబు తున్నది. నేరం రుజువైతే ఏడాది జైలు, రూ. 20వేల జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

నిర్భయ చట్టం- 2013..
2012 డిసెంబర్లో ఢిల్లిdలో గ్యాంగ్ రేప్కు గురై ఒక మహిళ మృతి చెందినప్పుడు ఈ చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేశంలో అమ్మాయిలు, మహిళలపై లైంగిక దాడులు ఎక్కువయ్యాయి. యాసిడ్ ఘటనలు పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాల్ని తీసుకురావాలని గత ప్రభుత్వాలు ఈ చట్టాల్ని తీసుకువచ్చాయి. మహిళలపై జరుగుతున్న దాడులు లైంగిక దాడులు వేధింపులు, కిడ్నాప్, హింస ఈ చట్టం కిందకు వస్తాయి.

మహిళా చట్టం- 2013..
లైంగిక వేధింపుల నుంచి మహిళల రక్షణకు చట్ట సభలు శాసనం చేసేవరకు ఈ మార్గదర్శక సూత్రా లు అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశిం చింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 2013లో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధ, పరిష్కార) చట్టం- 2013ను రూపొం దించింది.

వరకట్న నిషేధ చట్టం- 1961..
ఈ చట్టం ప్రకారం కట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే! వరకట్న వేధింపులకు సంబంధించిన మహిళలు నేరుగా సంబంధి త పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. భర్తగానీ, అతని తల్లిదం డ్రులుగానీ, ఆడపడుచులుగానీ, అత్తింటి తరఫున ఇతర బంధువు లెవరైనా గానీ వరకట్నం కోసం వేధిస్తే, ఐదేళ్లకు పైగా జైలు, 15వేలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. ఈ కేసులపై మొదటిశ్రేణి జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపి, శిక్షలు ఖరారు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: