దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దిశ ఘ‌ట‌న మలుపులు తిరుగుతోంది. దారుణంగా దిశ‌పై అత్యాచారం చేయ‌డం, అనంత‌రం ఆమెను హ‌త్య చేయ‌డం తెలిసిన సంగ‌తే. అయితే, అనంత‌రం నిందితులు ఎన్‌కౌంట‌ర్‌కు గుర‌య్యారు.  దిశ వస్తువులను సేకరించడానికి నిందితులను ఘటనా స్థలానికి  పోలీసులు తీసుకెళ్లగా  ఆయుధాలు లాక్కొని పోలీసులను చంపేందుకు ప్రయత్నించగా.. ఆత్మరక్షణ కోసమే ఎదురు కాల్పులు చెయగా నలుగురు నిందితులు చనిపోయారని పోలీసులు తెలిపారు. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ దృష్టి సారించిన‌ట్లు స‌మాచారం. త‌న‌దైన శైలిలో ఆయ‌న ఆరా తీస్తున్న‌ట్లు తెలుస్తోంది.

 

ఆయ‌న పేరు గాంధీ...పెళ్లాం ఉండ‌గానే అత్త‌పై రేప్‌.... ప్ర‌శ్నిస్తే ఏం చేశాడో తెలుసా?

 

దిశ నిందితులు ఆరిఫ్‌, శివ, నవీన్‌, చెన్నకేశవులు దారుణానికి ఒడిగ‌ట్టిన సంగ‌తి తెలిసిందే. డిసెంబర్ 6 పొద్దున 5:10 నిమిలకు దిశ వస్తువులను సేకరించడానికి నిందితులను ఘటనా స్థలానికి పోలీసులు తీసుకెళ్లగా ఘటనా స్థలానికి చేరుకోగా 6:10 నిమిషాలకు నిందితులు ఒక్కసారిగా పోలీసులపై తిరగబడ‌టంతో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. కాగా, మృతదేహాలను గాంధీ మార్చురీలో భద్రపరిచారు. తదుపరి ఆదేశాలు వెలువడేదాకా మృతదేహాలను భద్రతపర్చాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో...మృతదేహాలకు ప్రత్యేక ఇంజక్షన్లు ఇస్తున్నారు. రూ. 7,500 విలువైన ఈ ఇంజెక్ష‌న్లు ఇవ్వడం వల్ల మృతదేహాలను 4 నెలల వరకు భద్రపర్చవచ్చు. 

 

కేసీఆర్‌కు మోదీ దొరికిపోయిన‌ట్లేగా...ఇంకేం ముంది ఆడుకోవ‌డ‌మే

 

మ‌రోవైపు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన దిశ హత్య, నిందితుల ఎన్‌కౌంటర్‌తో పాటు, పలు అంశాలపై పార్టీ ఎంపీల‌తో ప్ర‌ధాని మోదీ చర్చించారని తెలుస్తోంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ప్రజా స్పందనపై మోదీ ఆరా తీసినట్లు సమాచారం. ఇదిలాఉండ‌గా, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిషన్‌ వచ్చే వారం హైదరాబాద్‌ రానుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలో.. బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రేఖా సొండూర్‌ బాల్టొడా, సీబీఐ మాజీ డైరెక్టర్‌ కార్తికేయన్‌తో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ.. తొలుత గాంధీ మార్చురీలో భద్రపరిచిన నలుగురు నిందితుల మృతదేహాలను పరిశీలించనున్నట్లు తెలిసింది. ఆ తర్వాతే.. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. ఎన్‌కౌంటర్‌ ప్రదేశాన్ని కమిషన్‌ సందర్శించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: