దేశంలో ఆత్యాచారాలు, హత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  వీటిని అరికట్టేందుకు ఎంతగా ప్రయత్నించినా ఉపయోగం  ఉండటం లేదు.  ఎంత ట్రై చేసినా కానీ, కొంచం కూడా తగ్గగకపోవడంతో అత్యాచారాలను అరికట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.  ఈ సంఖ్యను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా వాటిని అరికట్టాలి అని చూస్తున్నారు.  ఎన్ కౌంటర్ చేస్తున్నా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి శిక్షలు విధించేలా చేస్తున్నా ఈ సంఖ్య మాత్రం తగ్గడం లేదు.  


ఈ అత్యాచారాలకు సంబంధించిన మరో కేసు కోర్టుకు వచ్చింది.  అదే సమత కేసు.  కొమరం భీమ్ జిల్లాలోని రామ్ నాయక్ తండాలో నవంబర్ 24 వ తేదీన సమతపై ముగ్గురు నిందితులు అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే.  ఆరోజున సమత జ్ఞానేశ్వర్ పొలం వద్దకు రాగానే నిందితుల్లో ఒకడైన షేక్ బాబు ఆమెను బలవంతంగా పొలంలోకి నెట్టాడు.  అక్కడ ఆమెను అత్యాచారం చేసేందుకు సిద్ధం అయ్యారు.

 
షేక్ బాబుతో పాటు మరో ఇద్దరు నిందితులైన షాబుద్దీన్, మఖ్ధూంలు ఆమె కాళ్ళు చేతులు పట్టుకున్నారు.  ఒకరి తరువాత ఒకరు ఆమెపై రేప్ చేశారు.  గ్యాంగ్ రేప్ కు పాల్పడిన తరువాత వారిలో ఓ భయం ఏర్పడింది.  కామవాంఛ తీరగానే ప్రాణభయం పట్టుకుంది.  విషయం బయటకు తెలిస్తే ప్రాణాలు పోతాయి.  క్రిమినల్ కేసు అవుతుందని భావించిన ముగ్గురు ఆమెను చంపేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని భావించి వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశారు.  


ఆమె దగ్గరున్న సెల్ ఫోన్, 200 లాక్కొని పారిపోయారు.  ఈ సంఘటన జరిగిన మూడు రోజులకు పోలీసులు నిందితులను కోర్టుకు తీసుకొచ్చారు.  రేమండ్ లోకి తీసుకున్నారు.  96 పేజీల నివేదికను సిద్ధం చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు సమర్పించారు.  44 మంది సాక్షులను కూడా విచారించడం జరిగింది.  సాంకేతికంగా అన్ని అంశాలను ఈ కేసులో క్షుణ్ణంగా విచారణ చేసి దానికి సంబంధించిన ఛార్జ్ షీట్, ఇతర అంశాలను కూడా కోర్టుకు సమర్పించారు.  మరి ఈ కేసును ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో చూద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: