దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ప్రజ లకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా ఉల్లి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో చాలా మంది ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక సామాన్య ప్రజల పరిస్థితి అయితే మాటల్లో చెప్పలేనిది.ఉల్లిని కోయకుండానే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు సామాన్య ప్రజలు. ఇంకేం చేస్తాం అన్నట్లుగా సర్దుకుపోతూ ఉల్లి  లేకుండానే వంటలు  కానిచేస్తున్నారు. ఐదో పదో పెరిగితేనే బెంబేలెత్తి పోయే సామాన్య ప్రజలు ఇప్పుడు ఏకంగా ఉల్లి ధర వంద  దాటిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడిపోయారు. అయితే దేశవ్యాప్తంగా పెరిగిన ఉల్లి ధరలకు నిరసనగా చాలాచోట్ల నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

 

 

 అంతే కాదండోయ్  భారీగా పెరిగిన ఉల్లి ధరలతో అక్కడక్కడ ఉల్లిపాయలతో వినూత్న ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నారు. ఇక్కడ ఓ బట్టల వ్యాపారి అలాంటి ఆఫర్ నే  ప్రకటించాడు. తన వద్ద దుస్తులు కొన్నవారికి కిలో ఉల్లిపాయలు ఉచితంగా ఇస్తానని ప్రకటించాడు ఇక్కడ వ్యాపార. ఇంకేముంది బట్టలు కొంటే  ఉల్లి ఉచిత అని ప్రకటించడంతో ఈ బట్టల వ్యాపారి బిజినెస్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మహారాష్ట్రలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ఓ దుస్తుల వ్యాపారి ఉల్లి ధరను క్యాష్ చేసుకోవాలని భావించాడు. దీనికోసం తన షాప్ లో వెయ్యి రూపాయల విలువైన బట్టలు కుంటే కిలో ఉల్లిపాయలను ఇస్తాను అంటూ ఆఫర్ ప్రకటించాడు. 

 

 

 ఉల్లాస్ నగర్  లోని శీతల హ్యాండ్లూమ్స్ యజమాని తన షాప్ కి ఆఫర్ ప్రకటించాడు. ఇక ఉల్లి ధర  భారీగా పెరగడంతో ఈ ఆఫర్ కి ఎంతో మంది ఆకర్షితులయ్యారు ఇంకేముంది చాలామంది బట్టలు కొనుక్కొని ఉచితంగా ఉల్లి  తీసుకెళ్తున్నారు. దీంతో తన బిజినెస్ కాస్త ఇంప్రూవ్ అయిందని ఆ వ్యాపారి తెలుపుతున్నారు. కాగా   20 నుంచి 30 రూపాయల మధ్యలో ఉన్న ఉల్లి ధర ఏకంగా వంద  దాటడం తో ప్రస్తుతం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. భారీగా పెరిగిన ఉల్లి ధర కొంచెం కొంచెంగా మాత్రమే తగ్గుతుండటంతో ఉల్లి ధరలో  ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సబ్సిడీపై తక్కువ ధరకు ఉల్లిని  అందజేస్తున్నాయి దీంతో ప్రభుత్వం అందజేస్తున్న మార్కెట్ల వద్దకు  కూడా ప్రజలు బారులు తీరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: