దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే . ఉల్లి దిగుబడి తగ్గిపోవడంతో ఉల్లి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఏకంగా ఉత్తరాది రాష్ట్రాలలో ఉల్లి  రెండు వందల రూపాయలు పలుకుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో వందరూపాయల నుంచి 150 రూపాయల వరకు ధర పలుకుతోంది. భారీగా పెరిగిన ఉల్లి ధరలతో సామాన్య ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. అటు సామాన్య ప్రజలే కాదు అన్ని వర్గాల ప్రజలు ఉల్లి ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మంది సామాన్య ప్రజలు భారీగా పెరిగిన ఉల్లి ధరలతో ఉల్లి  వైపు వెళ్లకుండ వంటలు కానీచేస్తుంటే.. ఇంకొంతమంది భారీగా పెరిగిన ఉల్లి ధరలతో లబోదిబోమంటూనే ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు. అయితే భారీగా పెరిగిన ఉల్లి ధరలతో సామాన్య ప్రజల కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తక్కువ ధరలకే ఉల్లి అందించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్న ఇప్పటికీ పూర్తిస్థాయిలో మాత్రం ప్రజల అవసరాలను తీర్చడం లేదు. 

 

 

 ఇకపోతే దేశంలో భారీగా పెరిగిన ఉల్లి ధరలతో కన్నీళ్ల వెనుక ఆనందం కూడా కనిపిస్తోంది. ఒకప్పుడు ఉల్లి రైతులు సరైన ధర లేక కష్టాలు పడితే... ఇప్పుడు మాత్రం  జీవితంలోనే ఎప్పుడూ చూడనంత లాభాలను చవిచూస్తున్నారు ఉల్లి  రైతులు. దీంతో తమ ఆనందం వెనుక కష్టపు  కన్నీరంతా ఆవిరై పోతుంది. ఉల్లి ధరలు పెరిగాయని ఓవైపు ప్రజలందరూ గగ్గోలు పెడుతుంటే... ఉల్లి రైతుల ఆనందానికి మాత్రం అవధులు లేకుండా పోయాయి. ఒకప్పుడు ఖర్చులు పోను ఉల్లి రైతులకు మిగిలేది కొంత మొత్తంలో మాత్రమే కానీ భారీగా పెరిగిన ధరలతో రైతులందరూ లక్షాధికారులు గా మారిపోతున్నారు. దీంతో ఆనందంలో మునిగిపోయారు ఉల్లి రైతులు. 

 

 

 ముఖ్యంగా దేశంలోని రాయలసీమ కర్ణాటక రైతాంగం మాత్రం ప్రస్తుతం ఎక్కువ లాభాలను సంపాదిస్తున్నారు. ఎందుకంటే దేశం మొత్తంలో  వాడే ఉల్లిలో ఎక్కువ శాతం ఇక్కడి నుంచే ఎగుమతి అవుతుంది కాబట్టి..  ఇక్కడి ఉల్లి రైతులు మంచి లాభాలను పొందుతున్నారు. తాము పండించిన ఉల్లికి కనీస మద్దతు ధర కల్పించాలని పెట్టుబడులు కూడా తమకు రావడం లేదంటూ రైతులందరూ ఒకప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉల్లి  రైతులందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అది బాధతో కాదు ఆనందంతో. ఇకపోతే భారీగా పెరిగిన ఉల్లి ధరలతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా సబ్సిడీపై ఉల్లిని  ప్రజలకు అందజేస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: