2000 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబునాయుడు హయాంలో ఐటి సంస్థ భారీగా పెరిగింది. అప్పుడు ఐటి పరిశ్రమలు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించాయి. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూర్చి పెడుతుంది. అతి తక్కువ కాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించడానికి హైదరాబాద్ కు  దోహదపడింది ఐటీ సంస్థలు. తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐటీ దాన్ని ఆధారిత పరిశ్రమలు పై దృష్టిపెట్టింది.

 

దాని మెరుగుపరుచుకునేందుకు ప్రత్యేకంగా ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఉంది. ప్రస్తుతం ఉన్న మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కోకాపేట ప్రాంతాలకు మాత్రమే ఈ సంస్థలో పరిమితం కాకుండా హైదరాబాద్ నగరంలోని నలుదిశలా వ్యాపింప చేయాలని మౌలిక వసతులు కల్పించాలని అనుకుంటున్నట్లు సమాచారం. 

 

దీని, కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక రాయితీలతో హైదరాబాద్ ఐటీ అభివృద్ధి వ్యాప్తి విధానం 2020 రూపొందుతోందని తెలుస్తోంది. వచ్చే ఐదేళ్ల కాలపరిమితి లో ఈ క్రింది విధానాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నది. ప్రస్తుతం హైదరాబాదులో ఐటి పరిశ్రమ కేవలం పశ్చిమ ప్రాంతానికి మాత్రమే పరిమితం అయింది ముఖ్యంగా అక్కడ ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి.

 

భవిష్యత్తులో ఐటీ పరిశ్రమ మొత్తం ఒకే ప్రాంతానికి పరిమితం అయితే తీవ్రమైన సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఐటి విస్తరణకు అవసరమైన స్థలం  అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నగరం చుట్టూ ఏడు చోట్ల క్లస్టర్ లాంటివి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న పాత క్లస్టర్ విస్తరించడంతో పాటు కొత్త వాటిని కూడా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పశ్చిమ క్లస్టర్ లో కాకుండా మిగితా క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరం చివరి వరకు రాయితీ పొందే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పశ్చిమ క్లస్టర్లలో ఉన్న పరిశ్రమలు ఏదైనా కొత్త క్లస్టర్ల కు బదిలీ చేస్తే ఈ ఉపయోగాలు కూడా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: