హైదరాబాద్ షాద్నగర్ వైద్యురాలు దిశా  ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే .దిశా  కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసారు.కాగా దిశా  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశా ఘటణ తో దేశ ప్రజానీకం  ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాగా దిశ ఘటన తర్వాత అన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా.. తమ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఏకంగా దిశ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులకు  వెంటనే శిక్షపడేలా దిశ చట్టంలో కీలక ప్రతిపాదనలు చేస్తూ జగన్ సర్కార్ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. కాగా ఈ చట్టానికి సంబంధించిన బిల్లును ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా  దీనికి ఏపీ అసెంబ్లీ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 

 

 

 అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు లోకి రాబోతున్న  దిశ చట్టం పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జగన్ ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చట్టానికి సంబంధించి విధి విధానాలపై ఈరోజు ఉదయం చీఫ్ సెక్రటరీ నీలం సహాని,  డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇతర ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీలో ఆమోదం పొందిన దిశ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని మహిళలకు భద్రత కల్పించాలంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

 

 

 

 రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒక్కో స్పెషల్ కోర్టును ఏర్పాటు చేయాలని... ఆ కోర్టులో  మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అఘాయిత్యాలు కేసును విచారించాలని... నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలంటూ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి దిశా  చట్టానికి ఆమోదం కోసం వేచి చూస్తున్నా మంటూ ఈ సమీక్షలో  అధికారులు జగన్ కి తెలిపారు. కాగా కేంద్రం నుంచి దిశా  చట్టానికి ఆమోదం వచ్చేలోపు ఈ చట్ట అమలు కావలసిన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇక దిశ చట్టం ప్రకారం అత్యాచారం కేసులో డిఎన్ఎ పరీక్షలను 48 గంటల్లో పూర్తి చేసి సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని కలెక్టు  చేయాలని అధికారులను ఆదేశించారు

మరింత సమాచారం తెలుసుకోండి: