సాక్షి మీడియా.. ఇది ఏపీ సీఎం జగన్ కు చెందిన మీడియా అన్న విషయం అందరికీ తెలిసిందే. జగన్ కోసం.. జగన్ చేత.. జగన్ వల్ల నడుపుతున్న పత్రిక..అయితే దీన్ని క్లోజ్ చేయించేందుకు గతంలో చంద్రబాబు ప్రయత్నించారా.. అందు కోసం ఆయన ఏకంగా అప్పట్లో అధికారులతో కలసి కుట్ర పన్నారా.. తనకు అనుకూలమైన మీడియా కోసం చంద్రబాబు సాక్షి గొంతు నులిమేయాలనుకున్నారా.. అంటే.. అవునంటున్నారు వైసీపీ నాయకులు.

 

వైఎస్సార్ మరణం తరవాత.. జగన్ ను సీబీఐ కేసులు చుట్టుముట్టిన సమయంలో సాక్షిని చంపేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నాడని వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ అంశంపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ఆ రోజున కూడా జగతి పబ్లికేషన్‌కు సంబంధించి సాక్షిని ఎదుర్కోవడానికి చంద్రబాబు∙గందరగోళం చేశారని అంటున్నారు. అనుకూల మీడియాతో పుంకాలుగా కథనాలు రాయించారని అంబటి రాంబాబు గుర్తు చేసుకుంటున్నారు.

 

అలాంటి దుర్మార్గమైన రాజకీయాలు, కక్షసాధింపు అలవాటు చంద్రబాబుకు ఉంది.. అనుకూలమైన అధికారులను కీపోస్టుల్లో వేసుకొని, డిప్యుటేషన్‌ మీద తెచ్చుకొని అన్యాయాలు, అక్రమాలు చేసే ప్రభుత్వంగా చంద్రబాబు పాలన మిగిలిపోయింది.. అందువల్లే ప్రజలు తెలుగుదేశం పార్టీని తిరస్కరించారని అంటున్నారు అంబటి రాంబాబు.

 

జాస్తి కృష్ణకిషోర్, జేడీ లక్ష్మీనారాయణ ఇలాంటి వ్యక్తులతో వేధించాలనో.. మరోటి చేయాలనేది చేసి కక్షసాధింపులుగా చిత్రీకరించి ప్రజలను నమ్మించలేరు. ప్రజలకు సమస్యలు ఉన్నాయి.. ఆ సమస్యలపై స్పందించండి. ప్రభుత్వ అధికారి తప్పు చేస్తే అది ప్రభుత్వం చూసుకుంటుంది. ఇలా ఏది పడితే అది మాట్లాడి ప్రజలను నమ్మించాలని కక్షసాధింపు చర్యలు అని మాట్లాడి చంద్రబాబు దిగజారుడు రాజకీయం చేస్తున్నారు. ప్రజలు చూస్తూ ఊరుకోరు.. సహించరు. చంద్రబాబు పిచ్చి ఆరోపణలను ప్రజలు నమ్మొద్దని కోరుతున్నా.. నీతివంతమైన పాలనతో ముందుకు వెళ్లాలని సీఎం వైయస్‌ జగన్, వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం భావిస్తుందని అంబటి రాంబాబు తెలుగుదేశం నేతలకు హితవు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: