తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నికల్లో తమదే విజయం అనే ధీమాలో ఉండటానికి ప్రధాన కారణం ఒక మీడియా సంస్థ అనే సంగతి అందరికి తెలిసిందే. రాజకీయంగా చంద్రబాబు బలంగా ఉన్నారు జగన్ బలహీనంగా ఉన్నారు, సోషల్ మీడియాలో మినహా వైసీపీకి పెద్దగా బలం లేదు. చంద్రబాబు ఎక్కువ సభల్లో పాల్గొంటే జగన్ మాత్రం తక్కువ సభలకే పరిమితం అయ్యారు... ఆయన గెలవడం లేదు... ఆ నివేదిక ఈ నివేదిక అంటూ దాదాపు మూడేళ్ళ పాటు ఆ మీడియా సంస్థ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఒక భ్రమలో ఉంచింది.

 

రాజకీయంగా చంద్రబాబు తీసుకునే ప్రతీ నిర్ణయం వెనుక భారీ వ్యూహం ఉంది... గెలవడం పక్కా అంటూ మాట్లాడింది ఆ ఛానల్. ఆ ఛానల్ అధినేత కూడా తన అభిప్రాయాలను కార్యకర్తల మీద రుద్దే ప్రయత్నం భారీగానే ఎన్నికల సమయంలో చేసారు. దీనితో అప్పటి వరకు పని చేసిన కార్యకర్తలు చంద్రబాబు గెలిపిస్తారులే అనే భ్రమలోకి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఆ మీడియా సంస్థ చంద్రబాబుకి దూరం జరిగింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి.

 

రాజకీయంగా చంద్రబాబు కష్టాల్లో ఉన్న సమయంలో ఆ ఛానల్ ఆయన్ను వదిలేసింది అంటున్నారు... కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సహకరిస్తుంది అంటున్నారు. ఇటీవల ఆ ఛానల్ అధినేత వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని కలిసి దాదాపు గంట సేపు చర్చలు జరిపారు. అప్పటి నుంచి అధికార పక్షాన్ని విమర్శించడమే గాని తెలుగుదేశం పార్టీని మోసిన సందర్భం తక్కువ అంటున్నారు.

 

ఒక్కసారే కాకుండా క్రమంగా ఆ ఛానల్ చంద్రబాబుకి దూరం జరుగుతుందని అంటున్నారు. ఇక తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తో కూడా అదే దూరం పాటిస్తుంది ఆ ఛానల్. ఏదేమైనా ఆ ఛాన‌ల్ అధినేత‌కు రాజ‌కీయంగా అధికారంలో ఉంటేనే అవ‌స‌రం.. బాబు అధికారంలో ఉన్న ఐదేళ్లు బాగా వాడుకుని ఇప్పుడు వ‌దిలేశాడ‌న్న‌దే టాపిక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: