మనిషి బాడీలో అవయవాలు సరిగ్గా లేక పోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాడీలో అవయవాలు ఒకదాని ప్లేస్ లో మరోకటి ఉన్న ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాదు ఉండాల్సిన అవయవాల కంటే ఎక్కువ అవయవాలున్నా  ఎన్నో  ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే చాలామంది జన్యుపరమైన లోపాల కారణంగా అనవసర అవయవాలు వస్తూ ఉంటాయి. అంటే రెండు చేతులు కాకుండా మూడు చేతులు  రావడం.. ఒక తల కాకుండా రెండు తలలు రావడం లేకపోతే రెండు తలలూ అతుక్కుని రావడం లాంటివి ఇప్పటికే చాల జరిగాయి. ఇలాంటి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ఇలాంటి జన్యుపరమైన లోపాల కారణాలతో పుట్టే  సంఘటనలు అక్కడక్కగా  కనిపిస్తు ఉంటాయి . 

 

 

 

 తాజాగా ఇలాంటి శిశువుకు జన్మనిచ్చింది ఓ మహిళ. మూడు చేతులతో ఈ శిశువు పుట్టింది. ఈ ఘటన బాపట్ల లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అయితే మూడు చేతులలో శిశువు జన్మించడం పై ఆసుపత్రి వైద్యులు వివరణ ఇచ్చారు. జన్యుపరమైన లోపాల కారణంగానే శిశువు అలా జన్మించిందని వైద్యాధికారులు వెల్లడించారు. అయితే ఈ విషయం గురించి మాట్లాడిన వైద్యురాలు .. భార్యభర్తలిద్దరు మేనరిక వివాహం చేసుకున్నారని తెలిపింది . ఇంకా మరిన్ని వివరాలను తెలిపేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదని అందుకే తెలుప లేక పోతున్నామని వైద్యులు తెలిపారు. కాగా మూడు చేతులతో శిశువు జన్మించడం తో ఆస్పత్రిలో వారందరూ ఆ శిశువును చూడడానికి వస్తున్నారు. 

 

 

 అయితే ఆ మహిళ మొదటి నుంచి ఈ ఆస్పత్రిలోనే వైద్య చికిత్సలు చేయించుకుంటున్నది . అయితే మొదట 5 నెలల్లో ఆమెకు స్కానింగ్  చేసిన సమయంలో పిండం ఎదుగుదలలో ఇలాంటి లోపాలు ఏమి గుర్తించ లేదని వైద్యులు తెలిపారు. మరోసారి 8వ  నెలలో స్కానింగ్ చేసినప్పుడు పుట్టబోయే శిశువు కి మూడు చేతులు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. అయితే  అప్పటికే ఆలస్యం కావడంతో గర్భస్రావం చేయలేకపోయామని  స్పష్టం చేశారు. అయితే మూడు చేతులు శిశువుకు జన్మనిచ్చిన మహిళలకు సాధారణంగా కాన్పు జరిగిందని వైద్యులు తెలిపారు . అయితే ప్రస్తుతం జన్యుపరమైన లోపాలతో మూడు చేతులతో పుట్టిన శిశువు ఆరోగ్యం విషమంగా ఉందని... ఆ శిశువు బతికే అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. అయితే ఇదే దంపతులకు 3 సంవత్సరాల క్రితం తొలి కాన్పులో  చేతులు లేకుండా మగబిడ్డ పుట్టి  చనిపోయాడని వైద్యురాలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: