ఎన్నో శతాబ్దాల  చరిత్ర కలిగిన శబరిమల అయ్యప్ప దేవాలయం కి ఆడవారికి ప్రవేశం లేదు. ఒకవేళ ఆడవారు ప్రవేశించాలి అన్నా ఆ ఆలయ నిబంధనల ప్రకారం ఆడవాళ్ళకి ఒక నిర్ణీత వయస్సు ఉంటుంది.ఆ నిర్ణీత వయసు ఉన్న ఆడవారు మాత్రమే ప్రవేశానికి అర్హులు .శబరిమల ఆలయంలో ఆడవారి ప్రవేశాన్ని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు వాదనలు ముగిసిన తర్వాత సుప్రీంకోర్టు గత ఏడాది సెప్టెంబర్లో అన్ని వయసుల ఆడవారికి శబరిమల ఆలయంలో ప్రవేశం కల్పిస్తూ తీర్పునిచ్చింది .

 

ఈ తీర్పు మీద భిన్నాభిప్రాయాలు వెలువడుతూనే ఉన్నాయి. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారవ్యవహారాలను మంట కలిపే విధంగా సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది అంటూ అయ్యప్ప భక్తులు  సర్వత్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు కావడం దానిని విస్త్రత ధర్మాసనానికి బదిలీ చేయడంతో ఆడవారిని ఆలయ ప్రవేశానికి అనుమతి కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలోకి సురక్షితంగా పోలీసులు తీసుకెళ్లే విధంగా అనుమతి ఇవ్వాలి అంటూ కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు అయ్యాయి .

 

ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు నిరాకరించింది ఇది చాలా సున్నితమైనది అని వివాదాస్పదం తో కూడుకున్నది. అని హింసను తాము కోరుకొవడం లేదు . అని  పరిస్థితి హింసాత్మకంగా మారటాన్ని తాము సమ్మతించం అని దీనిపై త్వరలో విస్తృత ధర్మాసన ఏర్పాటుకు చర్యలు చేపడతాము అనితెలిపారు.

 

ఈ వివాదంపై ప్రముఖ గాయకుడు జేసుదాస్ స్పందిస్తూ అంటూ దయచేసి అయ్యప్ప దీక్షను భగ్నం చేయవద్దు అంటూ చెన్నైలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహిళలు శబరిమల అయ్యప్ప కు వెళ్ళద్దు అంటూ వినమ్రతతో కోరుకుంటున్నాను. అని అన్నారు అంతేకాదు ఒకప్పుడుఅయ్యప్ప స్వామి మాలధారణ దీక్ష చేసిన భక్తులు ఇంట్లో ఆడవాళ్ళూ అని కూడా చూసేవారు కాదు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది ఆయన అన్నారు .

 

ఎవరైనా అమ్మాయి వెళ్తే శబరిమల కు వెళ్తే అక్కడ అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులు ఆ అమ్మాయిని చూస్తారు.అని అది వారిలో చెడుభావన కలిగిస్తుంది  అని చేసి అందుకే ఆడవారిని శబరిమల కి వెళ్లొద్దు అని కోరుకుంటున్నాను అని ఆయన మాట్లాడారు మహిళలు వెళ్లడానికి ఎన్నో ఆలయాలు ఉన్నాయని ఆలయాలకి వెళ్లొచ్చు అని ఆయన అన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: