40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకొనే..తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి దిమ్మ‌తిరిగిపోయే షాకులు ఇస్తున్నార‌ని అంటున్నారు. ఒక‌దాని త‌ర్వాత మరొక‌టి అన్న‌ట్లుగా చంద్ర‌బాబును జ‌గ‌న్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రాజకీయాల‌కు సైతం గుడ్ బై చెప్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే, అనంత‌రం కొద్దిరోజుల‌కు  మీడియాతో మాట్లాడిన వంశీ తాను ప‌ద‌వికి రాజీనామా చేయ‌బోన‌ని ప్ర‌క‌టిస్తూ....తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉంటూనే...అధికార వైసీపీకి మద్దతిస్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

 

ర‌క్తం మ‌రిగిపోయే దారుణం...స్కూలు నుంచి పిలిపించి..సొంత బిడ్డ‌పై రేప్ చేసిన త‌ర్వాత‌

 

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో కలిసి నడుస్తా...అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని ప్ర‌క‌టించారు. అయితే, ఆయ‌న్ను తెలుగుదేశం పార్టీ స‌స్పెండ్ చేసింది. దీంతో వంశీ ఎమ్మెల్యేగిరి ఏం డోకా రాలేదు. ఇప్పుడు ఆయ‌న స్వ‌త్రంత్య స‌భ్యుడిగా స‌భ‌లో కొన‌సాగుతున్నారు. వైసీపీలో చేర‌లేదు కాబ‌ట్టి ఆ వైపు కూర్చోకుండా....టీడీపీలో లేరు కాబట్టి ప్ర‌తిప‌క్షం వైపు కూర్చోకుండా వంశీ ఒక్క‌రే కూర్చుంటున్నారు. అయితే, వంశీ రూపంలోనే...ఇంకొంద‌రితో క‌లిసి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ టీడీపీ అధ్యక్షుడు చంద్ర‌బాబుకు షాకిస్తార‌ట‌.

 

దిశ హ‌త్య‌పై మోదీ ఫోక‌స్‌... ముగ్గురు ప్ర‌ముఖుల‌ రాక‌... 4 నెల‌ల‌పాటు

 

నిబంద‌న‌ల ప్ర‌కారం, పార్టీకి రాజీనామా చేయకుండా ఇతర పార్టీ తీర్థం పుచ్చుకుంటే లేదా ఆ పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తే... వారిపై అనర్హత వేటు పడుతుంది. ఈ మేర‌కు స్ప‌ష్ట‌మైన నిబంధ‌న‌లు ఉన్నాయి. అయితే, ఇటు రాజీనామా చేయ‌కుండా...అటు వైసీపీలో చేర‌కుండా ఎమ్మెల్యేగా కొన‌సాగితే...ఆ స‌మ‌స్యే ఉండ‌దు. వంశీ ఇప్పుడు స‌రిగ్గా అదే చేస్తున్నారు. పార్టీతో స‌స్పెన్ష‌న్ వేటు వేయించుకున్నారు. కాబ‌ట్టి అన‌ర్హ‌త చాన్సే ఉండ‌దు. స‌రిగ్గా ఇదే ఫార్ములాలో కొంద‌రు ఎమ్మెల్యేలు...అధికార పార్టీలో చేచ‌సే ఆలోచ‌న చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన ఉప ఎన్నిక‌ల‌ను ఎదుర్కోన‌వ‌స‌రం లేకుండా...పార్టీ ఫిరాయించాల‌నుకునే ఎమ్మెల్యేలు అధిష్టానంపై దుమ్మెత్తిపోసి...అనంత‌రం పార్టీ నుంచి స‌స్పెన్ష‌న్ వేటు వేయించుకుంటార‌ని విశ్లేషిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: