ముగ్గురు దుర్మార్గులు ఒక కుటుంబం పాలిట శాపంలా మారి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీమ్ జిల్లా రాంనాయక్ తండా కు చెందిన సమత అనే యువతిపై గత నెల 24న ముగ్గురు దుర్మార్గులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అత్యంత పాశవికంగా సమత పై ఈ దారుణానికి ఒడికట్టిన ఈ నిందితులు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకునే ప్రయత్నం చేయగా నిందితుల ప్రయత్నం ఫలించలేదు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరపరుస్తామని చెప్పారు. 

 

ఈ నెల 24 నుంచి తన కోడలుపై అత్యాచారం జరిగిన దగ్గర నుంచి సమత మామ ముభావంగా ఉంటున్నారు. తన కోడలిపై జరిగిన దారుణాన్ని తలచుకుంటూ అన్నపానీయాలు ముట్టుకోవడం లేదు. ఎవ్వరు చెప్పిన వినకుండా అలానే వుంటూ చివరికి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు. ఇప్పటికే సమతపై అత్యాచారం జరిగిన నేపథ్యంలో విషాదంలో ఉన్న కుటుంబానికి ఈ ఘటన జీర్ణించుకోలేని విషాదాన్ని మిగిల్చింది. 

 

తన కోడలు తనను బాగా చూసుకునేదని, సమయానికి తనకు అన్నం పెట్టేదని, సొంత తండ్రిలా చూసుకునేదని సమత మామ తన కుటుంబ సభ్యులతో వాపోయాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సమత మామ మృతితో ఆ కుటుంబంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి. సమతపై అత్యాచారానికి పాల్పడి ఆమె మామ మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో పోలీసులు తొందరగా చార్జిషీట్ నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరు పరిచి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులకు కేవలం 21 రోజుల్లోనే ఉరి శిక్ష అమలు చేసేలా దిశ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలోనూ ఈ తరహా చట్టాన్ని తీసుకువచ్చి ఈ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: