హైదరాబాద్ మెట్రో మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది. మెట్రో అధికారులు రాత్రి సమయంలో చివరి సర్వీస్ ను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ మెట్రో చివరి సర్వీస్ రాత్రి 11 గంటలకు మొదలై 11.50 నిమిషాలకు ఆఖరి స్టాప్ వద్ద ఆగనుందని తెలిపారు. మెట్రో సర్వీసులు ఉదయం 6.30 గంటల నుండి మొదలుకానున్నాయి. 
 
మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో అధికారులు మెట్రో రైలు సేవలను విసృతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో మెట్రో చివరి సర్వీస్ రాత్రి 11 గంటల సమయంలో కూడా నడిచిన విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల సమ్మె తరువాత ఆర్టీసీ యాజమాన్యం దాదాపు 1000 బస్సులను రద్దు చేసింది. 
 
ఆర్టీసీ యాజమాన్యం ఆర్టీసీ కార్మికుల సమ్మె తరువాత నష్టాలను తగ్గించడంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది. సీఎం కేసీఆర్ కు ఆర్టీసీ యాజమాన్యం నష్టాలొచ్చే రూట్లలో ఆర్టీసీ బస్సులను నడపకపోవడమే మంచిదని వెల్లడించగా సీఎం కేసీఆర్ ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి అంగీకారం తెలిపారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం వైఫై సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. 
 
ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని చివరి సర్వీస్ ను కొనసాగించాలని మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె తరువాత మెట్రో చివరి సర్వీస్ ను రద్దు చేయాలని అనుకున్నప్పటికీ ప్రయాణికుల సౌకర్యార్థం ఈ సర్వీసులను కొనసాగించనుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో ఉదయం 6 గంటలకు మొదలైన మెట్రో సేవలు ఇకనుండి ఉదయం 6.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. మెట్రో అధికారులు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: