రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని అని చెప్పుకుంటూ ఢిల్లీని రేప్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా పేర్కొనడం ఎంతవరకు సమంజసం అంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది. రాహుల్ మాత్రం దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఢిల్లీని రేప్ క్యాపిటల్ గా పేర్కొంటే తప్పులేదు కానీ నేనంటే తప్పొచ్చిందా అంటూ బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర బీజేపీ తన ట్విట్టర్ అకౌంట్లో ఒక ఆసక్తికర ట్వీట్ పెట్టింది. 

 

https://mobile.twitter.com/bjp4karnataka/status/1203262120629919744

 

"ఓ బాలనేరస్థుడా, రాహుల్ రేపిస్టుల ఉరిశిక్ష కోసం పోరాడకుండా… సిగ్గులేకుండా ఇండియా ప్రతిష్టను తీసేస్తున్నావు… నిర్భయ, దిశలకు న్యాయం దక్కింది గానీ పాపం, సుకన్యాదేవి మాత్రం ఇంకా న్యాయం కోసం నిరీక్షిస్తున్నది… ఆమె కోసం ఫైట్ చేస్తావా రాహుల్?" అంటూ కర్ణాటక బీజేపీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ నేపథ్యంలో సుకన్యాదేవి ఎవరంటూ చర్చ మొదలైంది. ఇంతకీ ఈ సుకన్యాదేవి ఎవరు అనేది తెలియాలంటే 2006వ సంవత్సరానికి వెళ్ళాలి.

 

"రాహుల్ గాంధీ తన ఏడుగురు స్నేహితులతో కలిసి 2006వ సంవత్సరంలో అమేథిలోని ఒక గెస్ట్ హౌస్ కి వెళ్లారు. అదే గెస్ట్ హౌస్ దగ్గరలో బలరాం సింగ్ అనే కాంగ్రెస్ కార్యకర్త నివాసం ఉంటున్నాడు. అతని కూతురు సుకన్యాదేవికి కాంగ్రెస్ అంటే ప్రేమ, రాహుల్ గాంధీ గెస్ట్ హౌస్ కు వచ్చారని తెలిసి ఆమె రాహుల్ ను కలవడానికి గెస్ట్ హౌస్ కు వెళ్లగా ఆమెపై రాహుల్ అత్యాచారం చేశారు. ఆమె ఎలాగోలా అక్కడినుంచి తప్పించుకుంది. బలరాం సింగ్ మరియు అతని భార్య సుమిత్రాదేవి సోనియా గాంధీని కలిసి జరిగిన విషయం చెప్పారు కానీ సోనియా మాత్రం స్పందించలేదు, మానవ హక్కుల సంఘాన్ని కలిశారు అక్కడా వీరికి మొండిచేయి ఎదురైంది. ఆ తరువాత ఈ కుటుంబం కనిపించకుండా పోయింది" ఈ వార్త అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. 

 

2011వ సంవత్సరంలో యూపీకి చెందిన సమాజ్వాది పార్టీ ఎమ్యెల్యే సమ్రితే కోర్టులో కేసు వేసారు. కేసును విచారించిన కోర్టు అసలు బలరాం సింగ్ కు ఆ ఏరియాలో ఇల్లే లేదని, అతని కూతురు పేరు సుకన్యాదేవి కాదని కీర్తి సింగ్ అని, అలాగే బలరాం సింగ్ భార్య పేరు సుమిత్రాదేవి కాదని సుశీల అని పేర్కొంది ఈ కేసును ఒక కట్టుకథగా పేర్కొంటూ, ఈ కేసును వేసిన ఎమ్యెల్యేకు రూ 50 లక్షల భారీ జరిమానా విధించింది. ఇక తీర్పును సవాలు చేస్తూ సమ్రితే సుప్రీంను ఆశ్రయించగా సుప్రీం కోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్ధించింది. చివరికి రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్ ను ప్రమాదంలో పడెయ్యడానికి కావాలనే కొందరు ఈ కట్టుకథ అల్లారని తెలిసింది. ఒక కట్టుకథని పట్టుకొని రాహుల్ గాంధీని నిందించడం ఎంతవరకు సబబు అని కాంగ్రెస్ నాయకులు బీజేపీని నిలదీస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: