గమ్యం చేరాలంటే తొలి అడుగు తప్పని సరిగా వేయాలి. కాని కూర్చున్న చోటునుండే లెక్కలు వేస్తుంటే అనుకున్న విజయం సాధించలేమని అనాది నుండి ఎందరో విప్లవ కారులు, విద్యావేత్తలు, శాస్రజ్ఞులు , మహామహులు నిరూపించారు. ఇక ఏదైన సమస్య వస్తే ఆ వేడిలో లోకంలో ఉన్న జనం ఎంతో బాధ్యత గల వారిగా ప్రవర్తిస్తారు. రోడ్లెక్కుతారు, ధర్నాలు చేస్తారు, సంతాపాలు ప్రకటిస్తారు. ఒంట్లో ఉన్న ఆవేశం చల్లారాక ఇక ఆ విషయాన్ని మరచి పోతారు.

 

 

ఇలా సమాజంలో ఎన్నో సంఘటనలు వాటి తాలుకూ జ్ఞాపకాలు మరుగున పడిపోయాయి. ఎన్ని హత్యలు, హత్యచారాలు జరుగుతున్న కొత్తగా పుట్టే చట్టాలు వాటిని అడ్డుకొనలేక పోతున్నాయి. హక్కుల కోసం పోరాడే మహిళలు కొన్ని రోజులకు అలసి తమ ఉద్యమాన్ని విరమిస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్.. ప్రతి విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

 

 

ఇప్పుడు ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. తాజాగా జరిగిన దిశ హత్యాచా ఘటనతో కొత్తగా దిశ చట్టాన్ని తీసుకువచ్చి మరోసారి దేశం ద‌ృష్టిని ఆకర్షించారు జగన్.. అదేమంటే రాష్ట్రంలో మహిళలపై తీవ్రమైన  నేరాలకు పాల్పడే వారిపై, కేసులు నమోదు చేసిన తర్వాత త్వరితగతిన విచారణ జరిపించి, సరైన ఆధారాలు ఉన్ననేపద్యంలో కేవలం 14 రోజుల్లోనే విచారణను ముగించి, 21 రోజుల్లోనే జీవితఖైదు లేదా మరణ శిక్ష విధించనున్నారు. ఇకపోతే మహిళల భద్రతకు భరోసా ఇస్తోన్న ఇటువంటి చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చెయ్యాలన్న డిమాండ్ క్రమక్రమంగా ఉపందుకుంటోంది.

 

 

ఈ నేపద్యంలో గత పన్నెండు రోజులుగా ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్​పర్సన్​ స్వాతి మాలివాల్ నిరాహార దీక్ష చేస్తున్నారు. మహిళలపై జరుగుతోన్న దాడులు పట్ల కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఆమె తప్పుబట్టారు. ఈ క్రమంలో ఆమె ప్రధానికి లేఖ రాశారు. దిశ బిల్లును దేశవ్యాప్తంగా తీసుకొచ్చేవరకు నిరాహార దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. కాగా స్వాతి మాలివాల్‌కు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.          

మరింత సమాచారం తెలుసుకోండి: